ప్రొ.నాగేశ్వర్ : సీఎంను నేరుగా ఎన్నుకోవడమే ఫిరాయింపులకు పరిష్కారమా..?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఫిరాయింపులు కామన్‌గా మారిపోయాయి. తెలంగాణలో టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా చేరిపోతున్నారు. గతంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ గెలుపొందడంతో.. ప్రజలు తమను ఆదరిస్తారన్న భావనను..ఆయా ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజీనామాలకు కూడా సిద్ధమంటున్నారు.

అధికార పార్టీలో చేరిపోతున్న కాంగ్రెస్ నేతలు…!

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం… ప్రజాప్రతినిధిగా ఎన్నికల పార్టీకి రాజీనామా చేసినా.. ఇతర పార్టీ సభ్యత‌్వం తీసుకున్నా.. అనర్హులవుతారు. అయితే… అంతా స్పీకర్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అధికార పార్టీకి చెందిన స్పీకర్లు … ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదు. చట్టంలో ఉన్న లొసుగుల్ని బట్టి.. రాజకీయ నేతలు కూడా వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపు దారులు… పార్టీలు మారినా గెలుస్తున్నారు. తెలంగాణలో గెలిచారు. ఏపీలోని నంద్యాలలోనూ.. అభ్యర్థులు పార్టీలు మారినా.. ఫిరాయింపు దారులే గెలిచారు. ఎందుకంటే.. బలమైన నేతలు.. తమకు గ్రామ స్థాయిలో పట్టు ఉన్న నేతలు.. ఇతర పార్టీల్లో చేరడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే.. పార్టీ ఫిరాయించినా.. వారంతా తమతో వస్తారనే అంచనాతో ఉన్నారు. బీజేపీ నేతలు.. ఇతర పార్టీల్లో చేరడం చాలా తక్కువ. ఇతర పార్టీల నుంచి కూడా తక్కువ. బీజేపీ, కమ్యూనిస్టులు.. సిద్దాంతాల ఆధారంగా.. ఓట్ల దగ్గరకు వెళ్తారు. గతంలో ఓ కమ్యూనిస్టు ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో వీరు కూడా…మారుతున్నారు. వచ్చే సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పోలోమంటూ.. వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు సిద్ధాంత పరంగా కాదు.. పార్టీ పరంగా ఎన్నికలు..!

దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో పయనించిన నేతలు కూడా.. ఇప్పుడు పార్టీలు ఫిరాయిస్తున్నారు. సబితా ఇంద్రా రెడ్డి.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఆమె వెళ్లిపోయినా.. కాంగ్రెస్ పార్టీకి నష్టమేం లేదని.. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నష్టమో కాదో కానీ.. ఫిరాయింపుల్లో.. ఇది కొత్త కోణంగా భావించాలి. దశాబ్దాల అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా… టీఆర్ఎస్ లో చేరే వాతావరణం కనిపిస్తోంది. పార్టీ తప్పా… చేరుతున్న వారిది తప్పా… ప్రజలది తప్పా.. అంటే.. ముగ్గురిదీ తప్పే. ప్రజల చేతిలోనే అసలు పరిష్కారం ఉంది. ఫిరాయింపు దారుల్ని ఓడించాలని… ప్రజలు అనుకుంటే.. పరిష్కారం లభిస్తుంది. మన దేశంలో ప్రజాస్వామ్యమే ప్రధానం. భిన్నత్వంలో ఏకత్వం లాంటి దేశంలో అదే ముఖ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండాలని గట్టిగా కోరుకునేవారిలో నేను. ఎందుకంటే.. మన దేశంలో.. 40 శాతం మంది హిందీ మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఒక వేళ నేరుగా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకునే అవకాశం వస్తే.. ఎప్పటికీ.. దక్షిణాదికి అవకాశం రాదు.

ముఖ్యమంత్రిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటే పరిష్కారం..!

రాష్ట్ర స్థాయిలో అయినా నేరుగా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే అయినా ఈ పరిస్థితులు మారవచ్చేమో. జాతీయ పార్టీల్లో చూసినా.. ప్రాంతీయ పార్టీల్లో చూసినా ఇప్పుడు సిద్దాంతాల పరంగా ఎవరూ పోటీ చేయడం లేదు. నాయకుల కేంద్రంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. మోడీ వర్సెస్ రాహుల్.. జగన్ వర్సెస్ చంద్రబాబు.. అలా కేసీఆర్ కావాలా వద్దా… కేజ్రీవాల్ కావాలా వద్దా.. అన్నట్లుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల… గెలిచిన వాళ్లు.. సిద్ధాంతాలకు కట్టుబడకుండా పార్టీలు మారిపోతున్నారు. వీరిపై ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది కానీ.. అది స్పీకర్ చేతుల్లో ఉంటుంది కాబట్టి… ప్రయోజనం లేకుండా పోయింది. దేశంలో స్పీకర్లందరూ… అదే చేస్తున్నారు. ఈ చట్టాన్ని మార్చాలి. పార్టీ మారిన వెంటనే అనర్హతా వేటు పడేలా చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.