బాగానే రగులుతున్న హైకోర్టు చిచ్చు…!

ఏపీలో రెండు చిచ్చులు రగులుతున్నా ‘రాజధాని’ చిచ్చు ఒక్కటే బాగా కనబడుతోంది. ఎక్కువగా దాన్ని గురించే మాట్లాడుకుకుంటున్నారు. మీడియాలోనూ ఎక్కువగా దాని మీదనే చర్చ జరుగుతోంది. కాని ‘హైకోర్టు’ చిచ్చు కూడా బాగానే రగులుకుంటున్నది. ఇది కూడా ఉద్రిక్తతకు దారి తీసేలా ఉంది. ఇప్పటికే లాయర్లు ప్రాంతాలవారీగా విడిపోయి హైకోర్టు మా ఊళ్లో పెట్టాలంటే మా ఊళ్లో పెట్టాలంటూ డిమాండు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా పెద్ద తలనొప్పిగా మారేలా కనబడుతోంది. హైకోర్టును కర్నూలుకు తరలించడానికి పెద్దగా ఎవరికీ అభ్యంతరం లేదని, దాని విషయంలో పెద్దగా వివాదంలేదని కొందరు రాజకీయ నాయకులు చెబుతున్నారు. కాని చాలా జిల్లాల వారు హైకోర్టును కర్నూలుకు తీసుకువెళ్లాలనే ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు. 

హైకోర్టుతో సామాన్య ప్రజలకు అంతగా సంబంధం ఉండదు. కాని కర్నూలు దూరభారం అవుతుందని ఆ జిల్లాకు బాగా దూరంగా ఉన్న జిల్లాల ప్రజలు, న్యాయవాదులు అంటున్నారు. హైకోర్టు తరలించాలనే ప్రతిపాదనను ప్రధానంగా అయిదు జిల్లాల అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు, న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యాయవాదులైతే ప్రత్యక్ష పోరాటానికి దిగారు. కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టును అమరావతి నుంచి కదలించడానికి వీల్లేదని అంటున్నారు. హైకోర్టు రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేంద్రస్థానంలో ఉందని, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రావడానికి రవాణా మార్గాలు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. 

కోస్తాంధ్ర జిల్లాల న్యాయవాదులు తమ విధుల బహిష్కరణ ఆందోళనను వచ్చే నెల మూడో తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇది కాకుండా రోడ్డురోకో, రైల్‌ రోకో, వంటావార్పు, ధర్నాలు మొదలైన రూపాల్లో ఆందోళనను ఉధృతం చేస్తామంటున్నారు. హైకోర్టు తరలింపు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకునేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారు. కోస్తాంధ్ర న్యాయవాదులు రాజధాని తరలింపును కూడా తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. సచివాలయాన్ని తరలించవద్దంటున్నారు. హైకోర్టు, అసెంబ్లీ, రాజ్‌భవన్‌, సచివాలయం ఒక్కచోట ఉంటేనే అది సమగ్రమైన రాజధాని అవుతుందని చెబుతున్నారు. 

రాజధాని విభజన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల న్యాయవాదులు హైకోర్టు తమ ప్రాంతంలో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం..ఈ మూడు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ డిమాండ్‌ ఎప్పటినుంచో పెండింగులో ఉందని కొందరు లాయర్లు చెప్పారు. హైకోర్టు కర్నూలులో పెట్టడంవల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతాయంటున్నారు. తమ ప్రాంతం నుంచి కర్నూలు వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేదంటున్నారు. ఇక రాయలసీమ జిల్లాలవారంతా ముక్తకంఠంతో హైకోర్టును కర్నూలులో పెట్టాలని కోరుకోవడంలేదు. చిత్తూరు జిల్లావాసులు జిల్లా కేంద్రమైన చిత్తూరులోగాని, తిరుపతిలోగాని పెట్టాలంటున్నారు. 

తూర్పు గోదావరి జిల్లావారు హైకోర్టును తమ జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తూర్పు గోదావరి రాష్ట్రంలోనే పెద్ద జిల్లా కాబట్టి ఇక్కడ హైకోర్టు పెట్టడం సముచితమని అంటున్నారు. అసలు హైకోర్టు అమరావతి నుంచి తరలించకూడదని, ఒకవేళ తరలించాలని అనుకుంటే తమ జిల్లాలో పెట్టాలని తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదుల జేఏసీ నేతలు కోరుతున్నారు. హైకోర్టు పెట్టలేకపోయినా బెంచీ అయినా పెట్టాలంటున్నారు. ఇక్కడ హైకోర్టు బెంచీ ఏర్పాటు చేస్తామని 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హామీ ఇచ్చారని చెబుతున్నారు. మొత్తం మీద మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్రాన్ని రగిలిస్తోంది. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close