సస్పెన్షన్ లో ఉండి కుల రాజకీయాలు చేసుకుంటున్న ఏపీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తనపై నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇస్తే ఇప్పుడే రాలేనని సమాధానం పంపించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. అది కూడా వారం రోజుల ముందుగానే ఇచ్చింది.డిసెంబర్ నాలుగో తేదీన తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు.
గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన వస్తారని.. కీలక విషయాలు రాబట్టాలని సిట్ టీమ్ రెడీ అయింది. అయితే చివరి నిమిషంలో పీవీ సునీల్ కుమార్ ఈరోజు విచారణ కాలేనని పోలీసులకు సమాచారం పంపించారు. పదిహేను రోజుల సమయం కావాలని కోరారు. గతంలో సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు కేసులు కూడా నమోదు చేయకుండా.. ముందు అరెస్టు చేసేవాళ్లు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారు. కానీ ఆయనకు ఇంత ఫ్లెక్సిబులిటీ ఇచ్చి.. విచారణకు పిలిచినా సరే పదిహేను రోజుల సమయం కావాలని అడుగుతున్నారు.
సస్పెన్షన్ లో ఉన్నప్పుడు చేయకూడని పనులన్నింటినీ చేస్తున్న ఆయన పూర్తి గా సర్వీస్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారు.ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. చేసిందంతా చేయడం.. ప్రతి దానికి కులం అడ్డం పెట్టుకోవడం.. వైసీపీ నేతలు, తెలంగాణలో ప్రవీణ్ అనే బీఆర్ఎస్ నేతతో సమర్థింపు ట్వీట్లు పెట్టించుకోవడం కామన్ అయిపోయింది. విచారణకు హాజరు కాని ఆయనపై కోర్టు ద్వారా తగిన చర్యలను పోలీసులు తీసుకునే అవకాశం ఉంది.