టాలీవుడ్ లో తయారవుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘రాక’. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేశారు.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ కీలకమైన అంశం బయటకు వచ్చింది. ఈ సినిమాలో దీపికా పదుకొణె కాకుండా మరో ముగ్గురు హీరోయిన్లు ఖాయం అయ్యారు. రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కథానాయికలుగా కనిపిస్తారు. వీళ్ల ముగ్గురి పాత్రలకూ కథలో కీలకమైన స్థానం ఉంది. రష్మికకు బన్నీతో ఇది రెండో సినిమా. ఇది వరకు ‘పుష్ప’ సిరీస్ లో ఇద్దరూ జంటగా నటించారు. మిగిలిన ముగ్గురికీ బన్నీతో ఇది తొలి సినిమానే.
నలుగురు హీరోయిన్లతో బన్నీ ఓ సినిమా చేయడం ఇదే తొలిసారి. సో.. ‘రాకా’లో కావాల్సినంత గ్లామర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ నలుగురూ బన్నీతో ఒకే ఫ్రేమ్ లో కనిపించాలన్నది అభిమానుల ఆశ. అదే జరిగితే.. అదో పండగలా ఉంటుంది.
‘రాకా’కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇప్పటి వరకూ 40 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి. హీరో – విలన్ రెండూ బన్నీనే అని తెలుస్తోంది.
