వైసీపీ రద్దు అవుతుందంటున్న నర్సాపురం ఎంపీ..!

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన ఎంపీ పదవిపై వేటు వేస్తామని… బీజేపీ ఆశీస్సులు ఉన్నా… తామే అనర్హతా వేటు వేస్తామని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియాలో గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శరద్ యాదవ్ పై అనర్హత వేటు వేసిన అంశాన్ని హైలెట్ చేస్తూ.. అలాగే ఆయనను పదవి నుంచి తొలగింప చేయబోతున్నామని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రచారాలకు కౌంటర్‌గా.. రఘురామకృష్ణంరాజు కొత్త వాదన లేవనెత్తారు. వైసీపీని రద్దు చేయించబోతున్నట్లుగా పరోక్షంగా చెబుతున్నారు. తెలుగుదేశం అనుకూల మీడియా చానళ్లకు వైసీపీ నేతలు పిలుచుకునే వాటికి పదే పదే ఇంటర్యూలు ఇస్తూ.. తన లోక్‌సభ సభ్యత్వం రద్దవుతుందో లేదో కానీ.. వైసీపీకి మాత్రం రద్దు ముప్పు ఉందని ప్రకటించి .. కొత్త చర్చకు అవకాశం కల్పించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఏర్పాటుకాలేదని.. అలా నడవడం లేదని.. ఎన్నికల సంఘం.. పెట్టిన నియమాల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని.. రఘురామకృష్ణంరాజు ఓ నోట్ తయారు చేసి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లారు. దాదాపుగా గంటన్నర సేపు మాట్లాడారు. సాధారణంగా… ఏదైనా ఉంటే వినతి పత్రం ఇచ్చి వస్తారు. కానీ రఘురామకృష్ణంరాజు గంటల తరబడి మంతనాలు జరపడంతో.. ఏదో ఉందని చెబుతున్నారు. వైసీపీ నిబంధనలు ఉల్లంఘించిందని క్లారిటీ రావడంతో.. మరిన్ని వివరాలతో శనివారం కూడా ఎన్నికల సంఘం అధికారుల్ని కాలవాలని రఘురామకృష్ణంరాజు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. వైసీపీ పార్టీ రద్దు గురించి ఆయన మీడియాతో వ్యాఖ్యలు చేయడం.. కలకలం రేపుతోంది.

ఓ పద్దతి ప్రకారం.. రఘురామకృష్ణంరాజు.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని.. అయితే అనాలోచితంగా చేసినవి మాత్రం కాదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ముందూ వెనుకా చూసుకోకుండా వెళ్తున్న వైసీపీకి.. ఓ గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నం చాలా పెద్ద రేంజ్‌లో జరుగుతోందని.. దానికి రఘురామకృష్ణం రాజు నాయకత్వం వహిస్తున్నారన్న అభిప్రాయం.. వైసీపీలోనే ఏర్పడుతోంది. ఏడాది పాలన జరిగినా… ఎలాంటి అభివృద్ది లేకపోవడం.. చిన్న చిన్న పనులు కూడా చేయించలేకపోతూండటంతో.. ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కూడా పెరిగిపోయిన తరుణంలో.. రఘురామకృష్ణంరాజు.. ఆడుతున్న మైండ్ గేమ్… వైసీపీ హైకమాండ్‌కు కాస్త టెన్షన్ తెచ్చి పెట్టేలానే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close