కేసీఆర్‌ మాటల్లో రఘువీరా చేతికి బ్రహ్మాస్త్రం

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎట్టకేలకు ఒక బ్రహ్మాస్త్రం పట్టుకున్నారు. అది కూడా సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వెల్లడించిన విషయాలనుంచి తెలుసుకున్న సమాచారాన్ని.. ఆయన ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు మీదికి ప్రయోగించడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయంలో ఆయన ప్రధాన ప్రతిపక్షం వైకాపా కంటె ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పాల్సిందే. ఈ బ్రహ్మాస్త్రం ద్వారా చంద్రబాబునాయుడును ఎంతో కొంత ఇరుకున పెట్టడానికి రఘువీరా రెడ్డికి అవకాశం దొరుకుతుందనడంలో సందేహం లేదు.

పోలవరం డ్యాంకు సంబంధించిన ముంపు మండలాల విషయంలో ఖమ్మం జిల్లానుంచి కొన్ని మండలాలను ఏపీలో కలిపేస్తూ.. విభజన చట్టంలో సర్దుబాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చట్టం ప్రకారం ఈ మండలాలు ఏపీ స్వాధీనం అయిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఏపీ ప్రభుత్వ పరిపాలనే నడుస్తున్నది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి ఎగువన ఆ మండలాలు గ్రామాలు ఉంటాయి. ఆ మండలాలు ఏపీలోకి వెళ్లిపోవడం వలన భద్రాచలం పరిసర ప్రాంతాలు తగ్గిపోతాయి. ఈ విషయంలో కేసీఆర్‌ చొరవ చూపించారు. భద్రాచలం పరిసరాల్లో ఉండే కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణకు యిచ్చేయవలసిందిగా కోరానని, ఇందుకు చంద్రబాబునాయుడు కూడా అంగీకరించారని కేసీఆర్‌ చెబుతున్నారు. కేంద్రంతో మాట్లాడి ఈ గ్రామాలను వెనక్కు తీసుకోవడం త్వరలోనే జరుగుతుంది అంటున్నారు.

సరిగ్గా ఇదే మాటలను పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి పట్టుకున్నారు. పోలవరం ముంపు గ్రామాలు గనుక ఏపీ పరిధిలోకి వచ్చిన గ్రామాలను ఇప్పుడు మళ్లీ తెలంగాణకు తిరిగి ఇవ్వడం అంటే.. ప్రాజెక్టు ప్రయోజనాలను పణంగా పెడుతున్నట్లే కదా అనే వాదన లేవనెత్తుతున్నారు. కేసీఆర్‌ ఎలా చెబితే అలా చంద్రబాబునాయుడు ఆడుతున్నారని, చంద్రబాబును ఆడించే మంత్రదండం కేసీఆర్‌ చేతిలో ఉన్నదని రఘువీరా విమర్శించడం విశేషం. టీడీఎల్పీ సమావేశంలో కనీసం చర్చించకుండానే ఈ గ్రామాలను తిరిగి ఇచ్చేయడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దారుణం అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ముంపు కోటాలో ఏపీ పరిధిలోకి వచ్చిన గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేయడం అనేది చంద్రబాబు నిర్ణయాల విషయంలో మచ్చగా మారే అవకాశం పుష్కలంగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

మరో వైపు మంత్రి దేవినేని ఉమా మాత్రం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని.. ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణ కు ఇవ్వడం అనేది జరగని పని అని సెలవిస్తున్నారు. మంత్రి గారు ఇలా చెప్పడంలో ఆశ్చర్యం లేదు గానీ.. కేసీఆర్ చెబుతున్నవి అబద్ధాలు అనే సంగతి, చంద్రబాబు నోటిద్వారా వస్తే తప్ప నమ్మలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close