రిపీట్ ఆడియన్స్ కోసం ట్రిపులార్ మరో అస్త్రం

రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ల ట్రిపులార్ కలెక్షన్స్ స్టడీగా వున్నాయి. సోమ, మంగళ వారంలో కూడా నగరంలోని చాలా థియేటర్స్ లో హౌస్ ఫుల్ హంగామా కనిపించింది. అయితే బాహుబలికి వున్నట్లు రిపీట్ ఆడియన్స్ తో పోల్చుకుంటే ట్రిపులార్ కి తక్కువే. రాజమౌళి సినిమా అంటే బ్రాండ్ తో పాటు ఎన్టీఆర్ , చరణ్ అభిమానులు సినిమాని చూస్తున్నారు. అయితే రిపీట్ ఆడియన్స్ కోసం త్రీడీ ఫార్మేట్ పై ద్రుష్టి పెట్టింది చిత్ర బృందం.

ట్రిపులార్ ని త్రీడి లో ఫార్మాట్‌ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే త్రీడీ స్క్రీనింగ్ చాలా తక్కువ. హైదరాబద్ మొత్తంలో ఒక్క థియేటర్ మాత్రమే బుక్ మై షో లాంటి యాప్స్ లో కనిపిస్తుంది. ఈ వీకెండ్ నుంచి త్రీడీ స్క్రీన్స్ పెంచాలని నిర్ణయానికి వచ్చారు నిర్మతాలు. దేశవ్యాప్తంగా స్క్రీన్లు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే కాకుండా ఆ శుక్రవారం నుంచి పెంచిన టికెట్ల రేట్లు తగ్గించాలని డిస్టిబ్యూటర్స్ కి సమాచారం ఇచ్చారు. త్రీడి స్క్రీన్ లు పెంచడం, టికెట్ల ధర తగ్గించడం వలన రెండో వారం కూడా కూడా కలెక్షన్స్ స్టడీగా ఉంచాలనే ఆలోచనలో వున్నారు నిర్మాతలు. అంతేకాదు శనివారం వీకెండ్ తో పాటు ఉగాది కూడా వుంది. ఈ పండగ కూడా ట్రిపులార్ కి కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close