ప‌ద్ధ‌తి మార్చుకోని రాజ‌శేఖ‌ర్‌… చిరు ఆగ్ర‌హం

`మా`లో లుక‌లుక‌లు మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అది కూడా చిరంజీవి సాక్షిగా. `మా` డైరీ ఆవిష్క‌ర‌ణ కోసం చిరంజీవి వ‌స్తే – త‌న ముందు రాజ‌శేఖ‌ర్ నానా హంగామా చేశాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

`మా` డైరీ ఆవిష్క‌ర‌ణ ఈ రోజు హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్‌లో జ‌రిగింది. డైరీని ఆవిష్క‌రించిన చిరంజీవి ప‌రిశ్ర‌మ‌లోని మంచి చెడ్డ‌ల్ని ప్ర‌స్తావిస్తూ అంతా క‌ల‌సి మెల‌సి ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. దాంతో రాజ‌శేఖ‌ర్ వేదిక‌పై స‌డ‌న్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ స‌మ‌యానికి మాట్లాడుతున్న ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మైకు లాక్కుని మ‌రీ మాలో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని, చిరు మాటలు బాగానే ఉన్నా, నిప్పులేనిదే పొగ రాద‌ని, తాను సినిమాలు మానేసి, మా కోసం క‌ష్ట‌ప‌డుతుంటే.. త‌న‌ని తొక్కేయాల‌ని చూస్తున్నార‌ని వేదిక‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

దాంతో స‌భ‌లో ఉన్న అంద‌రూ అవాక్క‌య్యారు. రాజ‌శేఖ‌ర్‌ని ఎవ‌రు ఎంత స‌ముదాయించినా వినిపించుకోలేదు. స‌భా మ‌ర్యాద‌ని పాటించ‌కుండా – ఎవ‌రో మాట్లాడుతున్న మైకుని రాజ‌శేఖ‌ర్ లాక్కుని మాట్లాడం ఇదేం కొత్త‌కాదు. ఇది వ‌ర‌కు కూడా చాలాసార్లు ఇలా జ‌రిగింది. ఇప్పుడు చిరంజీవి ముందే ఈ సీన్ రిపీట్ అయ్యింది. మైకు లాక్కుని మాట్లాడ‌డం స‌భా మ‌ర్యాద కాద‌ని, త‌న పెద్ద రికాన్ని గౌర‌వించి కాస్త నిదానంగా ఉండ‌మ‌ని రాజ‌శేఖ‌ర్‌కి చిరు సూచించినా ఏమాత్రం మార్పు రాలేదు. ఓ సంద‌ర్భంలో చిరు రాజ‌శేఖ‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కూడా. ఇలాగైతే ఈ స‌భ‌కు త‌మ‌ని ఆహ్వానించ‌డం ఎందుక‌ని మండిప‌డ్డాడు. స‌భ‌కు రావ‌డం ఇష్టం లేక‌పోతే రావ‌డం మానుకోవాల‌ని, అంతేగానీ స‌జావుగా సాగుతున్న స‌భ‌ని అభాసు పాలు చేయ‌డం న‌చ్చ‌లేద‌ని, ఇలాంటి వాళ్ల‌పై చ‌ర్య తీసుకోవాల‌ని చిరంజీవి కాస్త ఘాటుగానే స్పందించారు. దాంతో ఎప్పుడూ కామ్‌గా సాగిపోయే మా డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌.. ఈసారి మాలోని రాజ‌కీయాల‌కు, సినీ ప‌రిశ్ర‌మ‌లోని లుక‌లుక‌ల‌కు అద్దం ప‌ట్టిన‌ట్టు అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close