జగన్ అక్రమాస్తుల కేసుల్లో వాన్పిక్దో ప్రత్యేక అధ్యాయం. ఇక్కడ చేసిన మోసం చాలదన్నట్లుగా అరబ్ దేశం అయిన రస్ అల్ ఖైమాను మోసం చేశారు. ఆ దేశం పెట్టుబడుల్ని స్వాహా చేశారు. ఆ సంస్థ ఇప్పుడు న్యాయపోరాటం చేస్తోంది. తాజాగా ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు.. వాణిజ్య కోర్టులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రోజువారీ అయినా సరే విచారణ జరిపి.. రస్ అల్ ఖైమా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక నిందితుడు. అతనిపై రస్ అల్ ఖైమా ప్రభుత్వం డబ్బు మోసం కేసు పెట్టింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్ లో రస్ ల్ అఖైమా ఇన్వెస్ట్మెంట్ అధారిటీ పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడి డబ్బుల్ని జగన్ సంస్థల్లోకి క్విడ్ ప్రో కోగా మళ్లించారు. వాన్ పిక్ కోసం గుంటూరు-ప్రకాశం జిల్లాల మధ్య 28,000 ఎకరాల భూమి కేటాయించారు. ఇదంతా ఎన్నో లింకులున్న పెద్ద స్కాంగా మారింది. తర్వాత సీబీఐ కేసులు పడ్డాయి. రాకియాను నిమ్మగడ్డ మోసం చేశారు.
నిమ్మగడ్డ ప్రసాద్‌ను 2019లో సెర్బియాలో అరెస్ట్ చేశారు. రాకియా ఫిర్యాదుతో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో బెల్గ్రేడ్లో నిమ్మగడ్డ అరెస్ట్ చేశారు. చాలా కాలం జైల్లో ఉన్న తర్వాత కరోనా వల్ల నిమ్మగడ్డకు కలిసి వచ్చింది. జైళ్లలోని నిందితులందర్నీ వదిలేయడంతో క్వారంటైన్లో హైదరాబాద్ వచ్చాడు నిమ్మగడ్డ. ఒప్పందాలు ఇక్కడే జరగడంతో హైదరాబాద్‌లోని వాణిజ్య కోర్టుల్లో రూ. 2,500 కోట్ల మోసం కేసు దాఖలు చేసింది. విచారణ ఆలస్యమవుతూండటంతో ఆ సంస్థ మళ్లీ కోర్టులో పిటిషన్ వేసి రోజువారీ విచారణకు ఆదేశాలు తెచ్చుకుంది.