టైమ్ మిష‌న్ లో టాలీవుడ్ హీరోలు

టైమ్ మిష‌న్ కాన్సెప్ట్ భ‌లే బాగుంటుంది. కాలాన్ని వెన‌క్కి తిప్ప‌డం ముందుకు వెళ్ల‌డం… గ‌తాన్ని, భ‌విష్య‌త్తునీ, వ‌ర్త‌మానంలోనే బేరీజు వేసుకోవ‌డం థ్రిల్లింగ్ కాన్సెప్ట్. ఇలాంటి క‌థ‌ల‌కు `ఆదిత్య 369` ఓ గీటు రాయి. సూర్య `24` కూడా టైమ్ మిష‌న్ లాంటి క‌థే. ఇప్పుడు ఈ జోన‌ర్‌లో మ‌రిన్ని సినిమాలు రాబోతున్నాయి.

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొందిన `ప్రాజెక్ట్ కె` టైమ్ మిష‌న్ నేప‌థ్యంలో సాగే క‌థే అని తెలుస్తోంది. ఇదో సైన్స్ ఫిక్ష‌న్ అని చిత్ర‌బృందం ముందే చెప్పేసింది. గ‌తంలోకి – భ‌విష్య‌త్తులోకీ వెళ్ల‌గ‌లిగే క‌నిక‌ట్టు.. ఈ సినిమాలో ఉంద‌ని స‌మాచారం. నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు ఇలాంటి క‌థే వ‌చ్చింది. చైతూ త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. అది సైన్స్ ఫిక్ష‌న్ అని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌.

ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా టైమ్ మిష‌న్ నేప‌థ్యంలో క‌థ‌నే ఎంచుకున్నాడ‌ని సమాచారం అందుతోంది. ప్ర‌స్తుతం శంక‌ర్ సినిమాతో బిజీగా ఉన్నాడు చ‌ర‌ణ్‌. ఆ త‌ర‌వాత గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సివుంది. అది టైమ్ మిష‌న్ క‌థే అని తెలుస్తోంది. మ‌రోవైపు శ‌ర్వానంద్ `ఒకే ఒక జీవితం` కూడా ఇలానే టైమ్ మిష‌న్ చుట్టూనే తిరుగుతుంద‌ట‌. నిజానికి బాల‌య్య కూడా ఈ జోన‌ర్‌లో ఓ క‌థ చేయాల‌నుకున్నాడు. ఆదిత్య 369కి సీక్వెల్ గా, ఆదిత్య 999 సెట్స్‌పైకి తీసుకెళ్దామ‌నుకున్నాడు. మ‌రి… అదెప్పుడు మొద‌ల‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close