ఇది విన్నారా.. చెర్రీ హిందీ సినిమా!

ఎక్క‌డ ఓడిపోయామో అక్క‌డే గెలవాలి అని ఫిక్స‌య్యాడేమో…. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి ప్రిపేర్ అయిపోతున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. 2016లో కాక‌పోయినా.. 2017లో అయినా అక్క‌డో సినిమా చేస్తా అంటున్నాడీ మెగా హీరో. గ‌తంలో జంజీర్ సినిమాతో ఓ డిజాస్ట‌ర్ మూట‌గ‌ట్టుకొన్నాడు చ‌ర‌ణ్‌. ఆ సినిమాకి క‌నీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఆర్థికంగా ఆ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌. దాంతో పాటు చ‌ర‌ణ్ న‌ట‌న‌ని కూడా అక్క‌డివాళ్లు ఎగ‌తాళి చేశారు. అందుకే.. ఇప్పుడు అక్క‌డ ఓ హిట్టుకొడితేగానీ మ‌న‌శ్శాంతి ఉండ‌ద‌ని చర‌ణ్ భావిస్తున్నాడేమో?

ఈసారి మాత్రం జంజీర్‌లా చేదు అనుభ‌వం ఎదురు కాకూడ‌ద‌ని జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడ‌ట చ‌ర‌ణ్‌. ప్రొడ‌క్ష‌న్ విష‌యంలో త‌న మిత్రుడు స‌ల్మాన్ ఖాన్ స‌హాయం తీసుకోవాల‌ని భావిస్తున్నాడు. దానికి స‌ల్మాన్ ఖాన్ కూడా ఓకే అన్నాడ‌ట‌. ఈ సినిమాకి స‌ల్మాన్ ఖాన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాలున్నాయ‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సినిమా తీస్తాడు స‌రే.. మ‌ళ్లీ జంజీర్‌లాంటి ఫ‌లితం వ‌స్తే అప్పుడు ప‌రిస్థితి ఏంటి? తెలుగునాటే చ‌ర‌ణ్ బాబుకి స‌రైన హిట్స్ ప‌డ‌డం లేదు. అలాంటిది బాలీవుడ్‌లో ఉద్ధ‌రించాల‌నుకోవ‌డం పొర‌పాటే. ముందు ఇంట గెలిస్తే.. ఆ త‌ర‌వాత ర‌చ్చ గురించి ఆలోచించొచ్చు. మరి చ‌ర‌ణ్ కి ఈ సంగతి చెప్పేదెవ‌రు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close