అఫీషియ‌ల్‌: స‌ల్మాన్ తో ర‌ష్మిక‌

ర‌ష్మిక జాక్ పాట్ కొట్టేసింది. ఓ క్రేజీ సినిమాలో ఆఫ‌ర్ అందుకొంది. స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. `సికింద‌ర్‌` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో ర‌ష్మిక‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. ఈ విష‌యాన్ని ర‌ష్మిక స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకొంది. ‘పుష్ష‌’ త‌ర‌వాత బాలీవుడ్ లో ర‌ష్మిక‌కంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. `యానిమ‌ల్‌`లోనూ మెప్పించింది. రెండు సినిమాలూ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యాయి. అందుకే బాలీవుడ్ నుంచి వ‌రుస ఆఫ‌ర్లు అందాయి. కానీ ర‌ష్మిక మాత్రం త‌దుప‌రి చిత్రాన్ని ఆచి తూచి ఎంచుకొనే ప‌నిలో ప‌డింది. స‌ల్మాన్ – మురుగ‌దాస్ అంటే క్రేజీ కాంబో. పైగా మురుగ‌దాస్ సినిమాల్లో క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ర‌ష్మిక మ‌రేం ఆలోచించ‌కుండా ఈ సినిమాకు ఓటేసింది. ర‌ష్మిక చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ధ‌నుష్ సినిమా ‘కుబేర‌’లో త‌నే క‌థానాయిక‌. ‘రెయిన్ బో’, ‘గాళ్ ఫ్రెండ్‌’ అనే మ‌రో రెండు సినిమాలు చేస్తోంది. ఇవి రెండూ నాయికా ప్రాధాన్యం ఉన్న క‌థ‌లే. ‘పుష్ష 2’ ఈ ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ జిల్లాల జోలికెళ్తే బీఆర్ఎస్‌ చేతికి సెంటిమెంట్ అస్త్రం !

తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీలు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ...

బీజేపీ మొదటి టార్గెట్ బీఆర్ఎస్సే !

ఎన్నికల ఫలితల తర్వాత బీఆర్ఎస్ ఉండదని కిషన్ రెడ్డి మాత్రమే కాదు బండి సంజయ్ సహా బీజేపీ నేతలందరూ చెబుతున్నారు. వారు ఈ మాటల్ని ఆషామాషీగా అనడం లేదు. అందుకే...

ఎన్నికలు ముగిసిన రేవంత్‌ ముందరి కాళ్లకు బంధమే !

లోక్ సభ ఎ్నికల పోలింగ్ ముగిసింది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుందామనుకుంటున్న రేవంత్ కు ఈసీ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. కనీసం కేబినెట్ సమావేశాన్ని కూడా స్వేచ్చగా ఏర్పాటు చేసుకునే అవకాశం...

ఓటును రూ. 5వేలకు అమ్ముకున్న మంగళగిరి ఎస్‌ఐ

మంగళగిరి ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకో.. వైసీపీ లీడర్‌కు కొమ్ము కాసినందుకో కాదు.. తన ఓటును ఐదు వేలకు అమ్ముకున్నందుకు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close