పొన్నూరు రివ్యూ : ఈ సారి ధూళిపాళ్ల చేయి దాటదు !

వరుసగా ఐదు సార్లు గెలిచారు. ఆరో సారి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఏడో సారి మాత్రం మరింత బలంగా కొట్టబోతున్నారు, ఆయనే ధూళిపాళ్ల నరేంద్ర. పొన్నూరు ప్రజల ఆదరాభిమానాల్ని పొందిన ఆయన ఆరోసారి గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

పొన్నూరు నియోజకవర్గం ధూళిపాళ్ల కుటుంబానికి కంచుకోట. మూడు దశాబ్దాలుగా అక్కడ సొంత పార్టీలో ఎలాంటి వ్యతిరేకతా లేకుండాఆయన మాటే చెల్లుబాటవుతూ వస్తుంది. ఆయనపై పోటీ చేసే అభ్యర్ధులు మాత్రం ప్రతిఎన్నికలకీ మారిపోతుంటారు. ఇన్నేళ్లలో ఆయన్ని ఒక్కసారి ఓడించగలిగిన సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చేసింది వైసీపీ. 1994 నుంచి టీడీపీ అభ్యర్ధిగా సంగం డెయిరీ చైర్మన్ ధూళ్లిపాళ్ల నరేంద్రే పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏడో సారి పోటీలో ఉన్న నరేంద్ర గత ఎన్నికల్లో ఒక్కసారే పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీ అభ్యర్థి పన్నెండు వేల ఓట్లను చీల్చడంతో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు.

నాలుగు సార్లు కాంగ్రెస్‌పై, ఒకసారి వైసీపీపై విజయం సాధించిన ధూళ్లిపాళ్ల నరేంద్రపై ప్రతిసారి ప్రత్యర్ధి మారుతూనే ఉన్నారు. ప్రత్యర్ధి పార్టీలు నరేంద్ర స్థాయి బలమైన నేత దొరక్క ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖంతో ప్రయోగం చేస్తున్నాయి. 1994 నుంచి ఆయనపై ఓ ప్రత్యర్థి రెండో సారి పోటీ చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే చేసిన చిల్లర పనులతో గెలవడం కష్టమని.. ఆయన స్థానంలో మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకి చాన్సిచ్చారు. అంతకు ముందు పొన్నూరులో పెద్దగా కనిపించని మురళి టిక్కెట్ ఇవ్వగానే దిగిపోయారు. తాను అరాచకాల్లో వైసీపీ రేంజ్ కు తగ్గనని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రశాంతమైన పొన్నూరులో అదే ఆయనను మరింతగా కిందకు దింపేస్తోంది.

నిజానికి పొన్నూరులో ధూళిపాళ్ల ఓడిపోయే చాన్సే లేదు. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో రెడ్డి ఓట్లు ఎక్కువగా ఉండే పెదకాకానిలోని కొంత భాగాన్ని పొన్నూరులో చేర్చి.. ధూళిపాళ్లను బలహీనం చేయాలని వైఎస్ ప్రయత్నించారు. అయితే ఆధిక్యం తగ్గింది కానీ ఓడించేంతగా మార్చలేపోయారు. జనసేన ఓట్ల చీలిక వల్ల గత ఎన్నికల్లో వెయ్యిఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి జనసేన కలసి వస్తోంది. ధూళిపాళ్లను జగన్ అక్రమంగా జైల్లో పెట్టించడం.. తమ పై జరిగిన దాడిగా పొన్నూరు ప్రజలు భావిస్తున్నారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేసి అమూల్ పరం చేయాలనుకున్న ప్రభుత్వ కుట్రపై రైతులు రగిలిపోతున్నారు. వైసీపీకి చెందిన రావి వెంకటరమణ సహా అనేక మంది టీడీపీలో చేరిపోయారు. ఎలా చూసినా.. వైసీపీకి ఘోర పరాజయం పొన్నూరులో రెడీగా ఉందని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెంగుళూరులో రేవ్ పార్టీ… తీగ లాగితే వైసీపీలో క‌దులుతున్న డొంక‌

బెంగుళూరులో రేవ్ పార్టీని భ‌గ్నం చేశారు అక్క‌డి పోలీసులు. బ‌డాబాబుల కార్లు, ప‌లువురు సెల‌బ్రిటీల‌ను, మోడ‌ళ్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ బ‌డా పారిశ్రామిక‌వేత్త‌కు చెందిన బెంగుళూరు సిటీ శివారులోని ఫాంహౌజ్ లో రేవ్...

‘ఆహా’కు ప‌వ‌న్ ఫ్యాన్స్ సెగ‌

ఈసారి ఏపీ ఎన్నిక‌లు మెగా ఫ్యామిలీ హీరోలు, అభిమానుల మ‌ధ్య చిచ్చు పెట్టాయి. అల్లు అర్జున్ వైకాపా అభ్య‌ర్థికి స‌పోర్ట్ చేయ‌డ‌మే అందుకు కార‌ణం. కుటుంబంలో ఓ హీరో, ఓ పార్టీ పెట్టి...

కౌంటింగ్ రోజున రణరంగం…ఈసీకి నిఘా వర్గాల నివేదిక..!!

ఏపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈసీకి ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందంటూ అలర్ట్ చేసింది. కౌంటింగ్...

కేసీఆర్ సైలెంట్… అప్ప‌టి వ‌ర‌కు అంతే!

మాజీ సీఎం కేసీఆర్ లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు హ‌డావిడి చేశారు. త‌న వ్య‌క్తిత్వానికి భిన్నంగా భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు బ‌దులుగా, కార్న‌ర్ మీటింగులు.. రోడ్ షోలు, చిన్న పిల్ల‌ల‌తో షేక్ హ్యాండ్స్,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close