17 ఏళ్ల నిరీక్షణ అనంతరం గత ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ.. తాజాగా జరుగుతున్న సీజన్లోనూ అదరగొడుతోంది. వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో టైటిల్‌కు ఇంకో అడుగు దూరంలో ఉంది.
టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో గుజరాత్ జట్టుపై విరుచుకుపడింది. వన్‌సైడ్‌గా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 255 పరుగుల భారీ లక్ష్యాన్ని జీటీ జట్టు ముందు ఉంచింది. కెప్టెన్ రజత్ 33 బంతుల్లో 93 పరుగులతో చెలరేగిపోయాడు.
కొండంత లక్ష్యాన్ని నిర్దేశించిన ఆర్సీబీ.. ఆ తర్వాత బంతితో ప్రత్యర్థిని పూర్తిగా డామినేట్ చేసింది. బ్యాటింగ్‌లో టైటాన్స్ చేతులెత్తేసింది. పవర్‌ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 92 పరుగుల ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ ఫైనల్ చేరేందుకు గుజరాత్‌కు మరో అవకాశముంది. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో జీటీ జట్టు తలపడుతుంది. అందులో విజయం సాధిస్తే ఫైనల్‌కు రావచ్చు.
కాకపోతే ప్రస్తుతం ఆర్సీబీ ఫామ్ చూస్తుంటే ఫైనల్‌కు రావాలనుకుంటున్న మిగతా మూడు జట్ల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయం. ఆర్సీబీ ప్రతి ప్లేయర్ టాప్ ఫామ్‌లో ఉన్నారు. విరాట్, పడిక్కల్, రజత్, వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృనాల్, రొమారియో.. ఇందులో ఎవరు నిలబడినా మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్న ఆటగాళ్లే.
అటు బౌలింగ్‌లో కూడా భువి, హేజిల్‌వుడ్, డఫీ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఎలా చూసినా ఈసారి ఆర్సీబీ జట్టు బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఫైనల్లోకి దూసుకెళ్లిన విధానం కూడా చాలా డామినేటింగ్‌గా ఉంది. మానసికంగా మిగతా జట్లను దెబ్బకొట్టిన ఆధిపత్య విజయమిది. ఇదే జోరు ఫైనల్లోనూ కనబరిస్తే ఆర్సీబీ రెండో టైటిల్‌ను ముద్దాడటం పెద్ద కష్టం కాదు.
