రియ‌ల్ లైఫ్‌… మాస్ట‌ర్లు వీళ్లే!

వెండి తెర‌పై మాస్టారు హోదాలో బెత్తం ప‌ట్టుకొని పాఠాలు చెప్పిన‌వాళ్లు చాలామందే ఉన్నారు. అగ్ర హీరోలు సైతం…. టీచ‌ర్ పాత్ర‌ని అవ‌లీల‌గా పోషించేశారు. నిజ జీవితంలోనూ కొంత‌మంది స్టార్లు ఉపాధ్యాయులుగా రాణించారు. ముందు పాఠాలు చెప్పే.. ఆ త‌ర‌వాత‌.. వెండి తెర‌పై డైలాగులు వ‌ల్లించారు. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా నిజ జీవితంలో పాఠాలు చెప్పిన సినీ సెల‌బ్రెటీల‌ లిస్టు ఒక్క‌సారి బ‌య‌ట‌కు తీస్తే….

త్రివిక్ర‌మ్ కొంత‌కాలం టీచ‌ర్‌గా ప‌ని చేశారు. ప్ర‌ముఖ న‌టుడు గౌత‌మ్ రాజు అబ్బాయికి ఆయ‌న ప్రైవేటు పాఠాలు చెప్పారు. అదీ కేవ‌లం పాకెట్ మ‌నీ కోస‌మే. గౌత‌మ్ రాజు ఇంట్లో పాఠాలు చెబుతూనే, సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించారు. సుకుమార్ లెక్క‌ల మాస్టారు అనే సంగ‌తి తెలిసిందే. కాకినాడ‌లో కొన్నేళ్ల పాటు ఆయ‌న మాథ్స్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశారు. ఆ ఉద్యోగం మానేసిన త‌ర‌వాతే ఆయ‌న సినిమాల్లో రాణించ‌డం మొద‌లెట్టారు. త‌న స్టూడెంట్స్ కూడా కొంత‌మంది ఇప్పుడు చిత్ర రంగంలోనే ఉన్నారు. హాస్య న‌టులు బ్ర‌హ్మానందం, ఎం.ఎస్‌.నారాయ‌ణ కూడా గురువులుగా ప‌నిచేశారు. వీరిద్ద‌రూ తెలుగులో టాప్‌. బ్ర‌హ్మానందం అత్తిలిలో ఉద్యోగం చేస్తూనే సినిమా అవ‌కాశాల కోసం వెదికారు. ఆయ‌న కొంత‌కాలం అటు ఉద్యోగం, ఇటు సినిమా వేషాలు అంటూ బాలెన్స్ చేశారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో పాఠాలు చెప్పారు. ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల కృష్ణ కూడా కొంత‌కాలం టీచ‌ర్‌గా ప‌నిచేసిన‌వారే. బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి వెళ్తే… జ‌గ్గ‌య్య‌, రాజ‌బాబు కూడా కొంత‌కాలం ఉపాధ్యాయులుగా ప‌ని చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close