శివ‌బాలాజీ గెల‌పుకి కార‌ణాలేంటి?

ఉత్కంఠ‌త నింపుతూ, వినోదాన్ని పంచుతూ..సూప‌ర్ హిట్ రియాలిటీషోగా నిలిచిన కార్య‌క్ర‌మం బిగ్ బాస్‌. 70 రోజుల ఈ ప్ర‌యాణానికి పుల్ స్టాప్ ప‌డింది. బిగ్ బాస్ విజేత‌గా ఎవ‌రు నిలుస్తారా?? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం కూడా దొరికేసింది. తొలి సీజ‌న్‌లో శివ బాలాజీ విజేత‌గా నిలిచి అంద‌రి మ‌న‌సుల్నీ గెలుచుకొన్నాడు. నిజానికి శివ బాలాజీ ఎంపిక అనూహ్య‌మేం కాదు. వారం రోజుల నుంచి… బిగ్ బాస్ విజేత‌గా శివ బాలాజీనే నిలుస్తాడ‌న్న ఊహాగానాలు వినిపిస్తూ వ‌చ్చాయి. చివ‌ర్లో అర్చ‌న‌, ఆద‌ర్శ్ కాస్త పోటీ ఇచ్చినా – ప్రేక్ష‌కుల అంచ‌నాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 11 కోట్ల పైచిలుకు ఓట్లు పోల‌యితే అందులో ఒక్క శివ బాలాజీకే 3 కోట్ల ఓట్లు రావ‌డం… శివ బాలాజీపై టీవీ ప్రేక్ష‌కులు పెంచుకొన్న ప్రేమ‌కు నిద‌ర్శ‌నం.

అయితే.. ఈ గెలుపు శివ బాలాజీకి అంత తేలిగ్గా ఏం రాలేదు. 70 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో అత‌ని క్ర‌మ‌శిక్ష‌ణే ఈ ప్ర‌తిఫ‌లాన్ని అందించింది. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కొత్త‌లో శివ‌బాలాజీ అంద‌రితోనూ అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించేవాడు. చిన్న చిన్న విష‌యాల‌కు కోపం తెచ్చుకొనేవాడు. అప్ప‌ట్లో శివ బాలాజీ చుట్టూ పోటీ కూడా ఎక్కువే ఉండేది. క్ర‌మంగా… శివ‌బాలాజీలో మార్పు రావ‌డం క‌నిపించింది. త‌న కోపం బాగా త‌గ్గించుకొన్నాడు. ఎంత పెద్ద స‌మ‌స్య నైనా చిరున‌వ్వుతో ఎదుర్కొనే వాడు. బిగ్ బాస్ హౌస్‌లో వంట చేయ‌డం అనేది పెద్ద ప్రోసెస్‌. దాన్ని చిటికెలో చేసేసి, అంద‌రి క‌డుపు నింపిన వ్య‌క్తి శివ బాలాజీనే. కొన్ని కీల‌క‌మైన సంద‌ర్భాల్లో హౌస్ మొత్తాన్ని ఒక్క తాటిలో న‌డిపేవాడు. అన్నిటికంటే ముఖ్యమైన విష‌యం ఏమిటంటే… బిగ్ బాస్ హౌస్‌లో అంద‌రూ, ఏదో ఓ సంద‌ర్భంలో ఓవ‌ర్ యాక్ష‌న్ చేసిన‌వాళ్లే. కానీ… శివ బాలాజీ అలా కాదు. ఏం చేసినా అందులో నిజాయ‌తీ క‌నిపించేది. ఆఖ‌రికి కోపంలో కూడా. అదే… అంద‌రికీ న‌చ్చింది. అందుకే… 3 కోట్ల పైచిలుకు ఓట్లు సాధించి విజేత‌గా నిలిచాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close