క్రిష్ – కంగ‌నా గొడ‌వ కు కార‌ణం ఎవ‌రు?

మ‌ణిక‌ర్ఱిక – నుంచి క్రిష్ బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం, ఈ సినిమాకి దర్శ‌కురాలిగా క్రిష్ ప‌క్క‌న కంగ‌నా ర‌నౌత్ కూడా త‌న పేరు వేసుకోవ‌డం.. ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌గ్గ‌ర నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ టీమ్‌తో క్రిష్ క‌ల‌వ‌లేక‌పోయాడు. ఇప్పుడు అస‌లు టీమ్‌కీ, క్రిష్‌కీ మ‌ధ్య ఎలాంటి కాంటాక్టూ లేకుండా పోయింది. సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ మ‌ణిక‌ర్ణిక క్రిష్ పేరుని ప‌ల‌వ‌రించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ సినిమా గురించి మాట్లాడ‌డానికి క్రిష్ కూడా స‌ముఖంగా లేడు.

క్రిష్‌ మ‌ణిక‌ర్ణిక‌ని వ‌దిలేసి… ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చేయ‌డంతోనే అస‌లు గొడ‌వ మొద‌లైంది. మిగిలిన స‌న్నివేశాల్ని కంగ‌నా త‌న‌కు తానే తీసుకుని.. ద‌ర్శ‌కురాలిగా త‌న‌కు క్రెడిట్ ఇచ్చుకుంది. అయితే.. క్రిష్ స‌న్నిహితుల వాద‌న మ‌రోలా ఉంది. ”చివ‌రి వ‌ర్కింగ్ టేట్ వ‌ర‌కూ క్రిష్ టీమ్‌తో నే ఉన్నాడు. ఆ త‌ర‌వాతే బ‌య‌ట‌కు వ‌చ్చాడు. తాను మ‌రో సినిమా ఒప్పుకున్నాన‌ని ఫ‌లానా రోజున వెళ్లాల‌ని కూడా క్రిష్ ముందే చెప్పాడు. క్రిష్ ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌లో పూర్తిగా బిజీ అయ్యాక‌. మ‌ళ్లీ ముంబై నుంచి కాల్ వ‌చ్చింది. కేవ‌లం అయిదు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మాత్ర‌మే మిగిలిఉంది. ‘ఎన్టీఆర్‌’ ప‌నుల ఒత్తిడి వ‌ల్ల‌… మ‌ణిక‌ర్ఱిక ప్యాచ్ వ‌ర్క్ లో పాలుపంచుకోవ‌డం క్రిష్‌కి కుద‌ర్లేదు. ఆ మాత్రం దానికే.. కంగ‌నా త‌న పేరు వేసేసుకుంది” అనేది క్రిష్ స‌న్నిహితుల మాట‌. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఓ పెద్దాయ‌న హ‌స్తం ఉంద‌ట‌. కంగ‌న‌ని రెచ్చ‌గొట్టి… క్రిష్ ప‌క్క‌న త‌న పేరు వేసుకునేలా ప్రోత్స‌హించింది ఆ పెద్దాయ‌నేన‌ట‌. నిజానికి ఈ ప్రాజెక్టు క్రిష్ చేతికి రావ‌డానికి మూల కార‌ణ‌మైన ఆ పెద్దాయ‌నే.. క్రిష్‌కీ మ‌ణిక‌ర్ణిక టీమ్‌కీ మ‌ధ్య అడ్డు గోడ‌లా నిలిచాడని చెబుతున్నారు. ఆ పెద్దాయ‌న ఎవ‌రు? అనే దానిపై టాలీవుడ్‌లో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close