తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ శైలి ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోకుండా, తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత. తాజా ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఏర్పాటు చేసిన విందుకు హాజరవ్వడం ద్వారా రేవంత్ మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.
డిలిమిటేషన్ బిల్లు వ్యవహారంపై కాంగ్రెస్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఢిల్లీ వెళ్లారు. బిల్లు వీగిపోయిది. అయితే శనివారం శనివారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇంట్లో ఇచ్చిన విందుకుహాజరయ్యారు. ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కుమారస్వామితో పాటు ఏపీ నేతలు పయ్యావుల కేశవ్, రఘురామ కృష్ణంరాజు వంటి వారితో కలిసి సరదాగా గడిపారు. ఈ విందుకు రాజకీయంతో సంబంధం లేదు. అంతా వ్యక్తిగత స్నేహం ఉన్నవారే.
అయితే రేవంత్ రెడ్డి ఎన్డీయే నేతల విందుకు హాజరయ్యారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇలాంటి విమర్శలను లెక్కచేసే వ్యక్తి కాదు. గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో పార్టీలకతీతంగా నేతలతో స్నేహపూర్వకంగా మెలిగారు. ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యమంత్రిగా తన బాధ్యతని, దీనిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదని రేవంత్ తనదైన శైలిలో సంకేతాలిస్తున్నారు.
భజన బ్యాచ్ మాటలు వినకుండా, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో రేవంత్ సక్సెస్ అవుతున్నారు. ఈ విందు రాజకీయాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యమేనని , తన రాజకీయ లక్ష్యం మాత్రం తెలంగాణ అభివృద్ధేనని ఆయన మరోసారి స్పష్టం చేసినట్లయింది.
