అడిగినప్పుడల్లా కోమటిరెడ్డికి రేవంత్ సారీ !

రేవంత్ రెడ్డి సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చే్యడం.. వెంటనే రేవంత్ రెడ్డి మారో మాట మాట్లాడకుండా.. బ్రదర్ సారీ అని చెప్పడం కామన్ అయిపోతోంది. అనవసరంగా సారీగా అడుగుతున్నా.. రేవంత్ పంతానికి పోతాడేమో… అలుసుగా తీసుకుందామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటున్నారు కానీ రేవంత్ సీన్‌ను అక్కడి దాకా తీసుకురావడం లేదు. కోమటిరెడ్డి డిమాండ్‌కు తగ్గట్లుగా స్పందిస్తున్నారు. ఇటీవల చండూరులో నిర్వహించిన సభలో కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దానికే కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి క్షమాపణ అడిగారు. రేవంత్ తన తప్పేమి లేకపోయినా క్షమాపణ చెప్పారు. ఇప్పుడు కోమటిరెడ్డి ఎలా స్పందిస్తార్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ క్షమాపణ చెబితే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి వస్తానని ఆయన షరతు పెట్టారు. ఇప్పుడు క్షమామణ చెప్పినందున రేవంత్‌ రెడ్డితో కలిసి ప్రచారానికి వస్తారేమో చూడాలన్న వాదన కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. నిజానికి కోమటిరెడ్డికి కాంగ్రెస్‌లో ఉండాలని లేదని.. గెంటించుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నారని చెబుతున్నారు.

సోదరుడితో కలిసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న వాదనవినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజకీయానికి రేవంత్ రెడ్డి పక్కాగా కౌంటర్ ఇస్తున్నారు. తాను ఎంత తగ్గుతున్నా..కోమటిరెడ్డినే లొల్లి చేస్తున్నారన్న భావన రేవంత్ పంపుతున్నారు. దీంతో కోమటిరెడ్డికి ఎలా ముందడుగు వేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close