ర‌వితేజ @ 75: వ‌చ్చే సంక్రాంతికి మాస్ దావ‌త్‌

ర‌వితేజ 75వ చిత్రానికి రంగం సిద్ధ‌మైంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. భాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ రోజు ఉగాది సంద‌ర్భంగా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రంలో ర‌వితేజ ల‌క్ష్మ‌ణ్ భేరి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ”ఆదాయం .. చెప్ప‌న్ తీయ్‌, రాజ పూజ్యం అన్ లిమిటెడ్‌, వ్య‌యం.. లెక్క చేయ‌న్‌, అవ‌మానం జీరో” అంటూ త‌న రాశి ఫ‌లాలు కూడా ఉగాది స్టైల్ లో చెప్పుకొన్నాడు ర‌వితేజ‌. దీన్ని బ‌ట్టి.. తెలంగాణ నేప‌థ్యంలో సాగే క‌థ అని అర్థ‌మైపోతోంది. ర‌వితేజ‌లోని మాస్ కోణాన్ని పూర్తిగా వాడుకొంటూ, ఈ క‌థ చేశార‌ని టాక్‌. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ర‌వితేజ ‘ధ‌మాకా’ చిత్రానికి భీమ్స్ ఇచ్చిన బాణీలు బాగా దోహ‌దం చేశాయి. ఇప్పుడు మ‌రోసారి వీళ్ల కాంబినేష‌న్ సెట్ట‌య్యింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. సంక్రాంతి లిస్టులో చాలా సినిమాలున్నాయి. విశ్వంభ‌ర‌, తండేల్‌, రాజా సాబ్‌, సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రాలు పొంగ‌ల్ బ‌రిలోనే నిలిచాయి. ఇప్పుడు ర‌వితేజ కూడా ఈ పోటీలో దిగిపోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి క్లాప్ కొట్ట‌నున్నారు. పూర్తి వివ‌రాలు ఇంకొద్ది రోజుల్లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close