బాల‌య్య కోసం మ‌రో టైటిల్‌

ప్ర‌స్తుతం ‘పైసా వ‌సూల్‌’ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. మ‌రోవైపు ర‌వికుమార్ ద‌ర్శ‌కత్వంలో న‌టించ‌డానికి ఒప్పుకొన్నాడు. సి.క‌ల్యాణ్ నిర్మాత‌. ఈ చిత్రం కోసం ప‌లు టైటిళ్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. ముందు ‘రెడ్డిగారు’ అనుకొన్నారు. అయితే ఇది ఓ వ‌ర్గానికి మాత్రమే ఇండికేట్ చేస్తుందేమో అన్న భ‌యంతో ‘జ‌య‌సింహా’ అనే టైటిల్‌ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ టైటిల్ కూడా ప‌క్క‌న పెట్టేశార్ట‌. ‘రూల‌ర్‌’ అనే టైటిల్ ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. ‘ద‌మ్ము’ సినిమాలో ఎన్టీఆర్ పాడుకొన్న పాట ఇది. ఈ టైటిల్ ఎన్టీఆర్ సినిమాల‌కూ ప‌రిశీలించారు. ఇప్పుడు బాల‌య్య సినిమా కోసం ప‌రిగ‌ణ‌లోని తీసుకొన్నారన్న‌మాట‌. ఈమ‌ధ్య ఇంగ్లీష్ టైటిళ్ల‌పై మొగ్గు చూపుతున్న బాలయ్య‌.. ‘రూల‌ర్‌’కి ఓకే చెప్పే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. ఆగ‌స్టులో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. క‌థానాయిక‌గా న‌య‌న‌తార‌ని ఎంచుకొన్న సంగ‌తి తెలిసిందే. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.