జగన్ రెడ్డి పుట్టిన రోజును ఎక్కడ చేసుకున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన తరపున వైసీపీ నేతలు అన్ని చోట్లా చేసుకున్నారు. పార్టీ ఆఫీసులో చేసుకున్నారు. ఆయన తరపున సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. అతి కామనే.. తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విన్న వారికి జగన్ రెడ్డికి ట్రోల్ చేసేది..చేయించేది ఈయనేనని మనసులో అనుకోకుండా ఉండలేరు.
5 ఏళ్లలో 20 ఏళ్లు ముందుకు తీసుకెళ్లారట.. ఈ సారి వచ్చి 30 ఏళ్లు ముందుకు తీసుకెళ్తారట !
కేక్ కట్ చేసిన తర్వాత సజ్జల తనదైన మార్క్ దీనమైన ముఖంతో.. రెండు చేతుల అరి చేతులు ఒకదాంట్లో ఒకటి పెట్టుకుని ట్రేడ్ మార్క్ ప్రసంగం ఇచ్చారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో ఇరవై ఏళ్లులో జరగాల్సిన అభివృద్ధిని చేసి చూపించారని తేల్చేశారు. మళ్లీ గెలిచి 30ఏళ్ల పాటు అభివృద్ధి చేస్తారట ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా పాలన చేశారన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా, జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని సెటైర్లు వేశారు. అంతే కాదు 200 సీట్లు గెల్చుకుంటామని చెప్పి.. అందరికీ షాకిచ్చారు. తర్వాత సీట్ల విభజన జరిగితే అని కవర్ చేసుకున్నారు.
సజ్జల ఇలా మాట్లాడి సోషల్ మీడియాకు సంకేతాలిస్తున్నారు !
సామాన్య జనం సంగతి తర్వాత ముందు పార్టీ నేతలు కూడా ఇవి జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నట్లుగా ఉన్నాయని అనుకుంటారు. కానీ సజ్జల మాత్రం అవే గొప్పగా చెప్పారు. ఆయనే అలా చేప్పారంటే.. సోషల్ మీడియాలోనూ అదే స్థాయి పరచారం చేయాలని అర్థం .చేయకుండా ఉంటారా?. ఇష్టం వచ్చినట్లుగా చేసి పడేస్తున్నారు. వాటిలో ఏమైనా ఒక్కరైనా నమ్మశక్యంగా ఉన్నాయని అనుకోవడం లేదు. తాము జగన్ రెడ్డిని పొగుడుతున్నామని కూడా అనుకోవడం లేదు. సెటైర్లు వేస్తున్నామని.. ట్రోలింగ్ చేస్తున్నామనే అనుకుని చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు సజ్జల, ఆయన కుమారుడి గుప్పిట్లోనే ఉంది. పేరుకు ఎవరో బకరాను ఇంచార్జ్ గా పెట్టినా పెత్తనం వీరిదే.
జగన్ను పలుచన చేయడం ప్రత్యేక వ్యూహమా ?
సజ్జల రామకృష్ణారెడ్డి తీరు ఎప్పుడూ అనుమానాస్పదమే. జగన్ రెడ్డి ఎందుకు ఇంతగా ప్రజల్లో కామెడీ అవుతున్నారో ఆ పార్టీ క్యాడర్ కు పజిల్ గానే ఉంటుంది. స్క్రిప్టులు చదివేటప్పుడు కాలేదు.. అమెజాన్ ఏఐ లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన వైరల్ అవుతూ ఉంటారు. అన్నీ రాసిచ్చినవే చదువుతారు. పైగా లైవ్ ప్రెస్మీట్ల కంటే ఎడిటెడ్ ప్రెస్మీట్లే ఎక్కువగా ఉంటాయి. ఆ ఎడిటెడ్ వాటిలోనూ ఈ ట్రోల్ అయ్యే స్టఫ్ ను ఎడిట్ చేయరు. ఎందుకిలా అన్నది వైసీపీ క్యాడర్ కు అర్థం కాదు. అంతా సజ్జల ప్రణాళిక ప్రకారం జగన్ ను ఓ జోకర్ గా మారుస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఎవరు జగన్ కు చెబుతారు?
