వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇక ఎవరూ పట్టించుకోవద్దని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అమరావతిపై ఆయన అత్యంత కీలకమైన ప్రకటన చేస్తే కనీసం సాక్షి పత్రికలో కూడా దాని రాకుండా చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడా సజ్జల వార్తలు కనిపించలేదు. అంతా అంతా ఇతర మీడియా, సోషల్ మీడియాల్లోనే వచ్చింది. ఇక్కడ సజ్జల తాను చెబుతున్నట్లుగా కాకుండా… తాను చెప్పినట్లుగా జగన్ రెడ్డి చేస్తారన్నట్లుగా మాట్లాడటం కూడా ఆయనకు మైనస్‌గా మారినట్లుగా తెలుస్తోంది.
సజ్జల మాటలకు దొరకని ప్రాధాన్యం
అమరావతిలో ఓ పొలిటికల్ కాంక్లేవ్ ను ఏర్పాటు చేయించింది సజ్జల. సైలెంటుగా అదేదో పెద్ద సంస్థ కాంక్లేవ్ అన్నట్లుగా ప్రచారం చేసి.. ప్యానెల్ మోడరేటర్లుగా కొంత మంది జర్నలిస్టుల్ని పెట్టుకుని వారి ద్వారా నేతల్ని ఎంగేజ్ చేసుకున్నారు. జగన్ రెడ్డి ఇలాంటి వాటికి రారు. వచ్చి ఆయన చెప్పేదేమీ ఉండదు. నవ్వులపాలు కావడం తప్ప జరిగేదేమీ ఉండదు. అందుకే రారు.. సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లి.. జగన్ తరపున అమరావతి మాటలు చెప్పారు. దాంతో ఒక్క సారిగా వైసీపీ పరువు పోయింది.
సజ్జల మాటల్ని పట్టించుకోవద్దని సాక్షికి.. పార్టీ నేతలకు చెప్పిన జగన్
తాను మళ్లీ గెలిస్తే ఏం చేస్తాను.. ఏం చేయను అన్నది జగన్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది. సజ్జల కాదు. కానీ సజ్జల జగన్ రెడ్డికి ఏమీ తెలియదు..నేను చెప్పినట్లే ఆయన చేస్తాడన్న నమ్మకంతో చెప్పాడు . కానీ సజ్జల మాటలు పూర్తిగా అమరావతికి జగన్ రెడ్డి ఓటు వేసినట్లుగా ఉన్నాయి. ఒక్క సారిగా మిస్ ఫైర్ కావడంతో జగన్ రెడ్డి ఉలిక్కిపడ్డారని.. అమరావతిపై ఆయన మాటల్ని ఎక్కడా తన మీడియా, సోషల్ మీడియాలో రాకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. దానికి తగ్గట్లుగానే ఆయనకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. అసలు అమరావతి టాపిక్ కనిపించలేదు.
తాడేపల్లి నుంచి సాగనండపమే మిగిలింది !
సజ్జల వ్యవహారంపై జగన్ రెడ్డికి చాలా రోజులుగా అసంతృప్తి ఉంది. ఆయన పార్టీలోకి వచ్చాకే అందరూ దూరమయ్యారని మెల్లగా తెలుసుకుంటున్నారు. ఆయన మాటలు విని పాతాళానికి పడిపోయారు. ఇప్పటికీ అదేజరుగుతోంది. సగం మంది పార్టీ నేతలు, క్యాడర్ సజ్జలపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ పరిణామాల్లో సజ్జలను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారని.. అందుకే ఆయనకు ప్రాధాన్యం తగ్గించాలని సందేశం పంపారని చెబుతున్నారు. మరో ఆరు నెలల్లో..సజ్జల కు.. విజయసాయిరెడ్డి గతి పట్టవచ్చన్న సంకేతాలు మాత్రం వైసీపీలో గట్టిగానే కనిపిస్తున్నాయి.