కర్నూలు బస్సు ప్రమాదంలో చాలా ఆారోపణలు చేశారు. వాటికి ఆధారాలేమైనా ఉంటే ఇవ్వమని పోలీసులు నోటీసులు ఇస్తే.. అసలు ఆ ప్రమాదం గురించే నాకేం తెలియదు ప్రెస్‌మీట్ లో మాట్లాడమని స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడేశానని పోలీసులకు చెప్పారు. పోసాని కృష్ణమురళి అదే చెప్పాడు. కృష్ణంరాజు అనే జర్నలిస్టు కూడా అదే చెప్పాడు. ఇలా వివాదాస్పదంగా మాట్లాడిన వారందరూ.. తమకేమీ తెలియదని స్క్రిప్టుల ప్రకారం చెప్పామని బహింగంగా చెప్పారు. అంటే వైసీపీలో అందరూ.. పై నుంచి వచ్చిన స్క్రిప్టుల ప్రకారమే మాట్లాడతారని అర్థం. మరి ఆ స్క్రిప్టులు రాసేదెవరు అంటే.. ఇంకెవరు సజ్జల అండ్ గ్యాంగ్.
సజ్జల మాటలు మాత్రమే అందరూ మాట్లాడతారు!
వైసీపీలో ఎవరు ఎప్పుడు ఏ అంశంపై మాట్లాడతారో ఎవరికీ తెలియదు. దానికి కారణం సజ్జలకు ఎవరు గుర్తుకు వస్తే వారికి ఫలానా అంశంపై మాట్లాడమని స్క్రిప్ట్ పంపుతారు. వారు మాట్లాడతారు. వైసీపీలో ప్రతి బూతు నాయకుడికి ఆ ఇమేజ్ రావడానికి కారణం సజ్జలే. మీరు ప్రత్యర్థిని బండబూతులు తిడితే జగన్ రెడ్డి దృష్టిలో పడవచ్చని సంకేతాలు పంపుతారు. వల్లభనేని వంశీకి మనిషి పుట్టుకల్ని ప్రశ్నించే స్క్రిప్ట్ కూడా పంపింది సజ్జలే. కానీ వంశీ ఆ ట్రాప్ లో బయటపడలేకపోయారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎంత రాజకీయాల్లో ఉన్నా.. ఘోరంగా అలాంటి తిట్లు తిట్టడానికి వైసీపీ నేతలు కూడా రెడీగా ఉండరు. కానీ పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వారికి తప్పదు.
సజ్జల స్క్రిప్టుల వెనుక పెద్ద కుట్ర – ఆ నేతలు మరో పార్టీలోకి పోలేరు!
ఈ బూతుల స్పీచ్‌ల వెనుక వైసీపీది భిన్నమైన వ్యూహం. జగన్ రెడ్డికి మానసిక ఆనందం మాత్రమే కాదు.. అంత ఘోరంగా తిట్టిన వారి రాజకీయ భవిష్యత్ మరో చోటకు వెళ్లి చూసుకునేలా ఉండదు. ఇప్పుడు పేర్ని నాని కానీ.. కొడాలి నానీకి కానీ.. వంశీకి కానీ మరో పార్టీలో చోటు ఉంటుందా?. వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు ముఖ్యంగా జగన్ రెడ్డిని చూసి నోరు పారేసుకున్న వారికి వేరే దిక్కులేదు. పార్టీలోనే పడి ఉండాలి. వారు అన్న మాటలకు మరో పార్టీ వారిని రానివ్వదు. అంటే జగన్ రెడ్డి వారి బలహీనతను ఆసరాగా చేసుకుని వారి రాజకీయ జీవితంపై చావు దెబ్బకొట్టారన్నమాట. బానిసల్లా ఉంటే తన పార్టీలో పడి ఉండాలి.. లేకపోతే రాజకీయ విరమణ చేయాలి. సజ్జల స్క్రిప్టుల వెనకు ఈ వ్యూహం కూడా గట్టిగా ఉంటుంది.
అందర్నీ బలి చేసి..తాను కింగ్ అవడమే జగన్ వ్యూహం
రాజకీయ పార్టీ ఇలా ఒకరి ఆలోచనల ప్రకారం నడిస్తే ఏ స్థాయికి దిగజారిపోతుందో చెప్పాల్సిన పని లేదు. దానికి వైసీపీనే సాక్ష్యం. రాజకీయ పార్టీ అంటే.. లీడర్లు సమాహారం. అందరూ బలంగా ఉంటేనే.. స్వయం ఆలోచన శక్తి ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. ఒక్కరి ఇమేజ్ కోసం అందర్నీ బలి చేసి.. తాము బలపడిపోతామనుకుంటే వైసీపీలానే అవుతుంది. ఆ పార్టీ అదృష్టం ఏమిటంటే..తాత్కలిక ప్రయోజనాల కోసం ఆశపడి .. వారిచ్చే తప్పుడు స్క్రిప్టులు చదవడానికి బకరాలు ఎప్పటికప్పుడు రెడీగా ఉండటమే.
