బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అమరావతిలో భేటీ అయ్యారు. సంజయ్ దత్ తన టీమ్‌ను కూడా తీసుకు వచ్చారు. ఇటీవల ముంబైలో మంత్రి నారా లోకేష్‌తో జరిగిన చర్చల కొనసాగింపుగానే ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సంజయ్ దత్తో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు గౌరవ్ దూబే, కునాల్ పటేల్, అనుజ్ కుమార్‌లు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ సినీ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఒక సమగ్రమైన సినిమా హబ్ లేదా ఫిలిం సిటీ అవసరం ఉందని భావిస్తున్న తరుణంలో, సంజయ్ దత్ బృందం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అమరావతి పరిసర ప్రాంతాల్లో లేదా విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిలిం సిటీని నిర్మించే ప్రతిపాదనపై సీఎంతో సంజయ్ దత్ సుదీర్ఘంగా చర్చించారు. సినిమా షూటింగ్‌ల కోసం సింగిల్ విండో అనుమతులు, మౌలిక సదుపాయాలు మరియు ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి చంద్రబాబు వారికి వివరించారు.
గత నెలలో ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్‌ను సంజయ్ దత్ కలిశారు. ఆ సమయంలోనే ఏపీ అభివృద్ధిపై లోకేష్‌కు ఉన్న స్పష్టమైన విజన్‌ను సంజయ్ దత్ ప్రశంసించారు. “కేష్ భాయ్.. నేను ఏపీకి వచ్చేస్తా అంటూ ఆనాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. లోకేష్ చొరవతోనే బాలీవుడ్ ప్రముఖులు ఏపీ వైపు చూస్తున్నారని, త్వరలోనే రాష్ట్రంలో భారీ సినీ స్టూడియోల నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.


