ఈమధ్య హీరోలు, దర్శకులు, నిర్మాతల స్పీచులు, వాళ్లు ఇచ్చే ఓవర్ హైప్ ల వల్ల సినిమాలు గాడి తప్పుతున్నాయి. ప్రెస్ మీట్లలో, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ‘మా సినిమా అంత కాదు.. ఇంత’ అని చెప్పుకొంటారు. తీరా చూస్తే, సినిమా గాడి తప్పుతుంటుంది. అప్పుడు అవ్వాల్సిన డామేజీ కంటే, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ప్రమాదం నుంచి పెద్ద సినిమాలూ తప్పించుకోలేకపోయాయి. చిన్న సినిమాలైతే ఈజీ టార్గెట్ అవుతాయి.
‘రావు బహద్దూర్’ సినిమా గురించి ఇండస్ట్రీ మంచి అంచనాలే పెట్టుకొంది. ఆమధ్య `నాట్ ఈవెన్ టీజర్` విడుదల చేశారు. అందులో సత్యదేవ్ విశ్వరూపం చూశారంతా. వెంకటేష్ మహా … ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడన్న భరోసా కలిగింది. నిన్ననే విజయ్ ఏసుదాస్ పాడిన పాట బయటకు వచ్చింది. ఆ పాట కూడా బాగుంది. అయితే ఈ ఈవెంట్ లో సత్యదేవ్ తన స్పీచ్ తో ఓవర్ హైప్ ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాని బాహుబలి, వారణాసి, అవతార్ సినిమాలతో పోల్చాడు. ఆ సినిమాలు ఎంత హై ఇచ్చాయో, థియేటర్లో ఎలా కూర్చోబెట్టాయో, ఈ సినిమా కూడా అలానే కూర్చోబెడుతుందని మాట ఇచ్చాడు. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా టైమ్ ఉంది. బయటకు రావాల్సిన కంటెంట్ చాలా ఉంది. ఇంతలోనే ఇంత హై ఏమిటా? అని సినీ వర్గాలు షాక్ లో పడిపోయాయి.
కాకపోతే.. కంటెంట్ చూసిన వాళ్లంతా ఈ సినిమాని అదే స్థాయిలో మోస్తున్నారట. సత్యదేవ్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమా ఇది. దాదాపు రూ.25 కోట్లు ఖర్చయ్యిందని టాక్. మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఈ సినిమాలో భాగం పంచుకొంది. ఆ బ్రాండ్ ఇమేజ్ కలిసొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సత్యదేవ్ స్పీచ్ మాత్రం ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. వాటిని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఈ చిత్రబృందం మీదే ఉంది.
