వారసులకు టిక్కెట్లివ్వాలని కేసీఆర్‌పై సీనియర్ల ఒత్తిడి !

నేను ముసలోడ్ని అవుతున్నా… పోచారం కూడా అవుతున్నాడు. అయినప్పటికీ నేను ఉన్నంత కాలం పోచారం ఎమ్మెల్యేగా ఉండాలి అని… బాన్సువాడ సభలో కేసీఆర్ ప్రకటించారు . కేసీఆర్ ఇలా ఎందుకు ప్రకటించారంటే… పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇక ఎన్నికల రాజకీయాలు తన వల్ల కాదని.. తన కుమారుడికి చాన్సివ్వాలని కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్ారు. దీంతో ఆయన నేరుగా ప్రజల ముందే ఇలాంటి ప్రకటన చేసేసి.. తాను వారసులను ప్రోత్సహించాలనుకోవడం లేదని తేల్చేశారు కేసీఆర్ ప్రకటన పోచారంను నిరాశపర్చింది. ఒక్క పోచారమే కాదు.. బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , మల్లారెడ్డి వచ్చే ఎన్నికల్లో తనయులను బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి 2014లోనే చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మల్లారెడ్డి తన ఇద్దరు తనయులు భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి లకు రాజకీయ భవిష్యత్ కల్పించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం తమ తనయులకు రూట్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇప్పటికే కొడుకు ప్రశాంత్ రెడ్డితో నియోజకవర్గమంతా పాదయాత్ర చేయిస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు తన తనయుడు రోహిత్ రావు ను మెదక్ అసెంబ్లీ నుంచి బరిలోకి దింపాలనుకుంటున్నారు.

కేసీఆర్ ఇటీవల టిక్కెట్ల కసరత్తులు కూడా ప్రారంభించారు. అన్ని రకాల నివేదికలను తెప్పించుకుని. .. కొంత మంది సిట్టింగ్‌లను మార్చాలని నిర్ణయించారు. అయితే వారసులకు ఇవ్వాలా లేదా అనే దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై స్పష్టత లేదు. గెలిచి తీరాల్సిన ఎన్నికలు కాబట్టి వారసుల జోలికి వద్దని అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close