‘స్పైడ‌ర్‌’కి శంక‌ర్ హ్యాండిచ్చేశాడు

ఈరోజు సాయింత్రం చెన్నైలో స్పైడ‌ర్ ఆడియో రిలీజ్ జ‌ర‌గ‌బోతోంది. తెలుగు, త‌మిళ పాట‌ల్ని అక్క‌డే విడుద‌ల చేయ‌నన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి శంక‌ర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది చిత్ర‌బృందం. శంక‌ర్ కూడా వ‌స్తాన‌ని మాటిచ్చాడు. కాక‌పోతే చివ‌రి నిమిషాల్లో శంక‌ర్ డ్రాప్ అయిన‌ట్టు స‌మాచారం. రోబో 2 ప‌నుల్లో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న శంక‌ర్‌.. స్పైడ‌ర్ ఆడియోకి రాలేన‌ని చెప్పాడ‌ట‌. దాంతో.. స్పైడ‌ర టీమ్ పూర్తిగా నిరుత్సాహంలో కూరుకుపోయింది. రాజమౌళి కూడా ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి హాజ‌ర‌వుతాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇప్పుడు గెస్టులెవ‌రూ లేకుండా చిత్ర‌బృందం మ‌ధ్యే ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంద‌ట‌. ఆడియో విడుద‌ల రోజునే థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డం ఆన‌వాయితీగా మారింది. అయితే.. స్పైడ‌ర్ థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని ఈ రోజు విడుద‌ల చేయ‌డం లేద‌ని స‌మాచారం. రెండ్రోజుల త‌ర‌వాత‌.. ట్రైల‌ర్‌ని వ‌దులుతార‌ట‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి హారీశ్ జ‌య‌రాజ్ సంగీతం అందించాడు. ఈ ద‌స‌రా కానుక‌గా ఈనెల 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర‌బృందం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.