సెంటిమెంట్‌ని న‌మ్ముకొన్న శ‌ర్వానంద్‌

సాధార‌ణంగా రెండు పెద్ద సినిమాలు వ‌స్తున్నప్పుడు ‘మీడియం’ రేంజు సినిమాలు కాస్త జంకుతాయి. ఇద్ద‌రి మ‌ధ్య నలిగిపోతామేమో అన్న బెంగ ఉంటుంది. అటు ‘జై ల‌వ‌కుశ‌’, ఇటు ‘స్పైడ‌ర్‌..’ వీటితో పోటీ ప‌డే.. ఏ సినిమాకైనా తెగింపు, ధైర్యం అవ‌స‌రం. ఈ రెండు సినిమాల‌తో పాటు ద‌స‌రాకి విడుదల అవుతున్న‌ మ‌హానుభావుడు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ద‌స‌రా సీజ‌న్ అని శ‌ర్వా టెమ్ట్ అవుతున్నా – ద‌స‌రా వ‌ల్ల ఒన‌గూరే అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఈ సినిమాకి పెద్ద‌గా ఉండ‌క‌పోవొచ్చు. కాక‌పోతే… శ‌ర్వాని సెంటిమెంట్ కూడా ప్రోత్స‌హిస్తోంది.

వ‌రుస‌గా రెండు సంక్రాంతి సీజ‌న్ల‌లో త‌న సినిమాని విడుద‌ల చేశాడు శ‌ర్వానంద్‌. ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి రెండూ పెద్ద హీరోల‌తో, పెద్ద సినిమాల‌తో పోటీగా వ‌చ్చి నిల‌దొక్కుకొన్న‌వే. రెండూ బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యాల్ని సాధించాయి. పెద్ద హీరోల‌తో త‌ల‌ప‌డిన ప్ర‌తీసారీ శ‌ర్వా హిట్ కొట్టాడు. సేమ్ టూ సేమ్ పండ‌గ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా శ‌ర్వా ల‌బ్ది పొందాడు. సేమ్ టూ సేమ్ ఈసారీ అలానే జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది చిత్ర‌బృందం న‌మ్మ‌కం. అందుకే రెండు బ‌డా హీరోలు వ‌స్తున్న త‌రుణంలో కూడా.. శ‌ర్వా ధైర్యంగా ముంద‌డుగు వేస్తున్నాడు. ఈ ద‌స‌రాకీ.. శ‌ర్వా హిట్ కొట్టేస్తే – ఈ సెంటిమెంట్ మ‌రింత బ‌ల‌ప‌డిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close