బాల‌య్య‌… బ్ర‌హ్మ‌చారి 40 +

నంద‌మూరి బాల‌కృష్ణ – న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో బాల‌కృష్ణ బ్ర‌హ్మ‌చారిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. 40 ఏళ్ల‌యినా పెళ్లి కాని పాత్ర‌లో బాల‌య్య న‌టిస్తున్నాడ‌ని టాక్‌. ఇందులో క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉంటుంది. తానెంత‌గానో ఇష్ట‌ప‌డిన అమ్మాయి (న‌య‌న‌తార‌) మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. ఆ అమ్మాయి జ్ఞాప‌కాల‌తో క‌థానాయ‌కుడు జీవితాన్ని గ‌డిపేస్తుంటాడ‌న్న‌మాట‌. మ‌రొక‌ర్ని పెళ్లి చేసుకొన్న ఆమె.. మ‌ళ్లీ అత‌ని జీవితంలో ప్ర‌వేశిస్తే ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం కుంభ‌కోణంలో షూటింగ్ జ‌రుపుకొంటోంది. అక్క‌డ 28 రోజుల పాటు కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేయాలని భావిస్తున్నారు. కంచె, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాల‌కు సంగీతం అందించిన చిరంత‌న్ భ‌ట్ ఈ చిత్రానికి స్వ‌ర‌క‌ర్త‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com