‘సైరా’… చిరంజీవి త‌ర‌వాత జ‌గ‌ప‌తిబాబుదే!

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ని ‘సైరా న‌ర‌సింహారెడ్డి’గా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. సైరా న‌ర‌సింహారెడ్డిలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, నాజ‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌… ఇలా హేమా హేమీలైన న‌టులు క‌నిపించ‌బోతున్నారు. చిరంజీవి త‌ర‌వాత‌.. అంత‌టి ప్రాధాన్యం ఉన్న పాత్ర మాత్రం జ‌గ‌ప‌తిబాబుకే ద‌క్కింద‌ట‌. న‌ర‌సింహారెడ్డి ముఖ్య అనుచ‌రుడుగా జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. న‌ర‌సింహారెడ్డిని న‌మ్మించి.. బ్రిటీష్ వారికి ప‌ట్టించ‌డానికి కార‌ణ‌భూతుడ‌య్యే పాత్ర జ‌గ‌ప‌తిబాబుద‌ట‌. ఒక విధంగా నెగిటీవ్ షేడ్స్ ఉంటాయ‌న్న‌మాట‌. దాదాపు అగ్ర హీరోలంద‌రి చిత్రాల్లోనూ న‌టించిన జ‌గ్గూభాయ్‌కి ఇప్ప‌టి వ‌ర‌కూ చిరంజీవితో క‌ల‌సి న‌టించే అవ‌కాశం రాలేదు. క‌నీసం మెగా ఫ్యామిలీలో ఉన్న రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ, ప‌వ‌న్‌ల‌తో కూడా వ‌ర్క్ చేయ‌లేదు. తొలిసారి అవ‌కాశం రావ‌డం, అందులోనూ కీ రోల్ కావ‌డంతో జ‌గ్గూభాయ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడిప్పుడు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌ప‌తిబాబు చేసిన పాత్ర‌లు ఒక ఎత్త‌యితే.. సైరాలో మ‌రో ఎత్త‌ని, జ‌గ్గూభాయ్ గెట‌ప్ లో కూడా మార్పు క‌నిపించ‌బోతోంద‌ని జ‌గ‌ప‌తిబాబు స‌న్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close