శర్వానంద్ నారి నారి నడుమ మురారితో పండగకి వస్తున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రమిది. సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలు. ఈ రోజు సినిమా టీజర్ వదిలారు. టైటిల్ కి తగట్టుగానే ఇరువురి భామల కౌగిలిలో నలిగిపోయే హీరో కథ ఇది.
శర్వా సాక్షిని ఇష్టపతాడు. వివాహానికీ సిద్ధమౌతాడు. అంతా సజావుగా జరుగతున్న సమయంలో అతని మాజీ ప్రియురాలు సంయుక్త ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. టీజర్ లో ఫన్ బావుంది. సత్య లవ కుశ పాత్రతో మొదలైన టీజర్ చివరి డైలాగ్ వరకూ మంచి ఫన్ పండింది. చివర్లో శర్వా చెప్పిన ఆ అమ్మాయి ఈఎంఐ.. డైలాగ్ టంగ్ ట్విస్టర్ లా భలే నవ్వించింది. రాజాలా పెంచాను.. రోజా ముందు కూర్చుంటావా డైలాగ్ కూడా పేలింది.
సామజవరగమన లాంటి కామెడీ హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజు మరోసారి అలాంటి మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. శర్వా క్యారెక్టర్ లో మంచి ఫన్ వుంది. సాక్షి వైద్య, సంయుక్త పాత్రలు కూడా అలరించాయి. నరేష్ కి మరో మంచి పాత్ర పడింది. మ్యూజిక్, విజువల్స్ అన్నీ కూడా పండగ వాతావరణంలో వున్నాయి. కేరళ నేపధ్యం కూడా కలర్ ఫుల్ గా వుంది. జనవరి 14న సాయంత్రం ఆటతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
