వేశ్య పాత్రలో మరో హీరోయిన్

‘వేదం’లో అనుష్క, ‘పవిత్ర’లో శ్రియ, హిందీ సినిమా ‘డి డే’లో శృతి హాసన్ వేశ్య పాత్రల్లో నటించారు. అంతకు ముందు ఆ తరవాత పలువురు కథానాయికలు వేశ్యలుగా నటించారు. వేశ్య వృత్తిలోని బాధను వెండితెరపై తమ నటనతో చూపించి మెప్పించారు. వేశ్యలుగా నటించిన కథానాయికల జాబితాలో తాజాగా చేరిన అందాల భామ శ్రద్ధా దాస్. ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’తో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసి, తరవాత అల్లు అర్జున్ ‘ఆర్య 2’, ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఈ బెంగాలీ భామకు అదృష్టం కలిసిరాలేదు. సరైన విజయాలు లేక కెరీర్ ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. అయితే.. శ్రద్ధా దాస్ మాత్రం పట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి త‌ర‌హాలో ప్ర‌య‌త్నాలు చేస్తూనే వుంది. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా చేస్తుంది. అలాగే వేశ్య పాత్రకు ఓకే చెప్పింది. అయితే… ఆమె వేశ్యగా నటిస్తున్నది సినిమాలో కాదు. షార్ట్ ఫిలింలో. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దీపక్ పాండే దర్శకత్వం వహిస్తున్న షార్ట్ ఫిలిం ‘శృంగారదాన్’లో శ్రద్ధా వేశ్యగా కనిపించనుంది. ఇందులో వేశ్య వృత్తికి వ్యతిరేకి అయిన మధ్య వయస్కుడితో ప్రేమలో పడిన షైబ అనే అమ్మాయిగా నటిస్తున్నది. త్వరలో ఈ షార్ట్ ఫిలిం విడుదల చేయనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close