ఫల‌క్‌నామా దాస్‌.. సీక్వెల్ సీన్ ఉందా?

ఫ‌ల‌క్‌నామా దాస్.. ఇందులో ఉన్న మేట‌ర్ సంగ‌తేమో గానీ – ఈ సినిమాతో పాపుల‌ర్ అయ్యాడు విశ్వ‌క్ సేన్‌. సినిమా ద‌మ్మెంత‌? ఎంత వ‌సూలు చేసింది? అనే విష‌యాల కంటే… ఈ సినిమాకి ముందు, ఆ త‌ర‌వాత విశ్వ‌క్ సేన్ చేసిన హ‌డావుడి గురించే జ‌నాలు ఎక్కువ‌గా మాట్లాడుకున్నారు. ఇదే ఊపులో `ఫ‌ల‌క్‌నామా దాస్ 2` కూడా ప్ర‌క‌టించేశాడు హీరో క‌మ్ ద‌ర్శ‌కుడు. ఓ సినిమా బ‌యట‌కు వ‌చ్చాక‌, దాని ప‌బ్లిసిటీ కోసం రక‌ర‌కాల ప్రామిస్‌లు చేస్తుంటారు సినీ జ‌నాలు. అందులో సీక్వెల్ తీస్తాం… అని ప్ర‌క‌టించ‌డం ఒక‌టి. సీక్వెల్ తీస్తున్నారంటే, ఈ క‌థ‌లో, సినిమాలో.. ఏదో విష‌యం ఉండే ఉంటుంద‌ని జ‌నాలు అనుకుంటార‌ని, అలా అనుకోవ‌డం వ‌ల్ల సినిమాకి వ‌సూళ్లు పెరుగుతాయ‌ని కొన్ని కాకి లెక్కలు వేసుకుంటుంటారు. అయితే ఆ రోజులు పోయాయి. ఇదో ప‌బ్లిసిటీ ట్రిక్కు అని జ‌నాలు కూడా ఫిక్స‌యిపోతున్నారు.

ఫ‌ల‌క్ నామా దాస్ సీక్వెల్ వ్య‌వ‌హారం కూడా ఇలానే ఉంది. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబ‌డి, వ‌చ్చిన వ‌సూళ్లు.. బేరీజు వేసుకుంటే, నిర్మాత‌లు గ‌ట్టెక్కేసిన‌ట్టే. నైజాంలో ఈ సినిమా బాగానే వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆ మాత్రం దానికే ఈ క‌థ‌కి, ఈ సినిమాకీ సీక్వెల్ తీద్దామ‌నుకుంటే అది నిర్మాత‌ల అత్సుత్సాహ‌మే అవుతుంది. క‌థ ప్ర‌కారం చూసుకుంటే సీక్వెల్ ఛాన్స్ లేదు. దాసు అనే పాత్ర‌ని కంటిన్యూ చేసి, వేరే క‌థ అల్లుకుంటే త‌ప్ప సీక్వెల్ చేయ‌లేరు. దీన్ని బ‌ట్టి చూస్తే.. ఫ‌ల‌క్ నామా దాస్ 2 అనేది ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అనిపిస్తుంది. మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. విశ్వ‌క్ సేన్ చేతినిండా సినిమాలు చేరాయి. నాని నిర్మాత‌గా ఓ సినిమా పూర్తి చేయాల్సివుంది. ఎం.ఎస్‌.రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా ఉంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ కూడా విశ్వ‌క్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. హీరోగా బిజీగా ఉన్న‌ప్పుడు ఇలా ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం అంటూ మ‌రో రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేయ‌డం రిస్కే. దీన్ని బ‌ట్టి.. ఫ‌ల‌క్ నామా దాస్ 2… రావ‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close