తెలుగు స్టార్లను తలదించుకునేలా చేసిన సోనూ సూద్..!

చిత్తూరు జిల్లాలో ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లను.. కాడెద్దుల స్థానంలో పెట్టి విత్తనాలు విత్తుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంతగా అంటే.. ముంబైలో ఉంటున్న సోనూసూద్ వాటిని చూసి.. చలించిపోయారు. వారికి కావాల్సింది ట్రాక్టర్ అని.. ఉదయం కల్లా వారికి ట్రాక్టర్ అందించే బాధ్యతను తీసుకుంటానని ట్విట్టర్ ద్వారా అభయం ప్రకటించేశారు. సోనూ సూద్ స్పందన.. ఎప్పట్లాగే అందర్నీ ఫిదా చేసింది. లాక్ డౌన్ కాలంలో… కొన్ని వేల మంది వలస కూలీల్ని.. విద్యార్థుల్ని సొంత ఖర్చులతో.. బస్సులు.. రైళ్లు.. విమానాలను ఏర్పాటు చేసి.. స్వస్థలాలకు పంపారు సోనూసూద్. చివరికి కిర్గిస్తాన్‌లో ఇరుక్కున్న విద్యార్థుల్ని కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించి.. రప్పించారు. ముంబైలో తనకు ఉన్న హోటల్‌ను క్వారంటైన్ కేంద్రానికి ఇచ్చేశారు. ఆయన దాతృత్వం చూసి.. చాలా మంది ఈర్ష్యపడ్డారు. ఆయనకు వస్తున్న ఆదరణ చూసి.. శివసేన నేతలు కూడా.. రాజకీయం అని ఆరోపణలు చేశారు.

అయినా సోనూసూద్ .. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అందర్నీ మంచి చేసుకుంటూ వెళ్లి.. అందరికీ మంచి చేస్తూ పోతున్నారు. కేవలం.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికే కాక… ఇతర సమస్యలతో.. తన దృష్టికి వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై స్పందిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రైతు కుటుంబకష్టాలను క్రిష్ణమూర్తి అనే వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది అన్ని రకాల సోషల్ మీడియాల్లోనూ వైరల్ అయింది. కానీ.. అటు ప్రభుత్వ వర్గాల నుంచి కానీ.. ఇటు సినీ వర్గాల నుంచి కనీసపాటి స్పందన రాలేదు. ఎక్కడో ముంబైలో ఉంటూ… ఎలాంటి సంబంధం లేదని.. సోనూ సూద్ మాత్రం స్పందించారు. ఏకంగా ట్రాక్టరే పంపిస్తానని.. ఆ పిల్లలు ఇద్దరూ చదువుకోవచ్చని.. సూచించారు.

లాక్ డౌన్ కాలంలో.. కానీ ఆ తర్వాత కానీ… తెలుగు సినీ స్టార్లు.. ఎవర్నీ ఆదుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాలకు కొంత మొత్తం విరాళం ప్రకటించారు. సినీ ఇండస్ట్రీలో వారికి నిత్యావసరాలు ఇస్తామంటూ కొంత హడావుడి చేశారు. విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు.. సామాన్యులకు సాయం చేస్తామంటే.. కొంత మంది రాళ్లేశారు. దాంతో.. ఎవరూ.. ముందుకు రాలేదు. ఒక్క వలస కూలీకి సాయం చేయలేదు. ఇప్పుడు సోనూసూద్‌ అందర్నీ.. తలదించుకునేలా చేశారు. ఎందుకంటే.. ఎంతగా వద్దనుకున్నా… తెలుగురైతుకు వచ్చిన కష్టానికి.. సోనూసూద్ స్పందించారు కానీ.. మన స్టార్లు మాత్రం స్పందించలేదనే… పోలిక సహజంగానే వస్తుంది మరి…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close