సోడాలో ‘గ్యాస్‌’ తీసేసిన శ్రీ‌దేవి

శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌లో క‌థానాయిక పాత్ర‌కీ చాలా ప్రాధాన్యం ఉంది. శ్రీ‌దేవిగా ఆనందిని చ‌క్క‌గా న‌టించింది. అందంగా క‌నిపించింది. క్లైమాక్స్ లో త‌న పాత్ర మ‌రింత ఆక‌ట్టుకుంది. ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా త‌న‌కు చాలా ప్ల‌ప్‌. కానీ ఈ సినిమా ప్ర‌చారంలో ఆనందిని ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇక మీద‌ట క‌నిపించ‌దు కూడా.

ఈ సినిమా షూటింగ్ అయిన త‌ర‌వాత ఆనందిని అస‌లు చిత్ర‌బృందానికి ట‌చ్‌లో లేకుండా పోయింద‌ట‌. సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ఆనందిని తీసుకురావాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా ప్ర‌య‌త్నించారు. కానీ త‌న ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది. ఎన్నిసార్లు చేసినా స్విచ్చాఫేన‌ట‌. చివ‌రికి ఆనంద‌ని కాంటాక్ట్ ఏదోలా ప‌ట్టుకుంటే.. అస‌లు విష‌యం తెలిసింది. ఆనంది త‌ల్ల‌య్యింద‌ట‌. ఇటీవ‌ల ఆనందిని పెళ్లి చేసుకుంది. అప్పుడే తల్లి అయిపోయింది. అందుకే… ప్ర‌మోష‌న్ల‌కు రాలేక‌పోతున్నా అంద‌ట‌. ఏ సినిమాకైనా ప్ర‌మోష‌న్లు చాలా అవ‌స‌రం. పైగా ఈసినిమాలో శ్రీ‌దేవి పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. టైటిలే.. ఆ పాత్ర పై డిజైన్ చేశారు. అలాంట‌ప్పుడు ఆనందిని వ‌స్తే బాగుండేది అనుకున్నారంతా. చివ‌రికి.. త‌ను ఇలా చెప్పేస‌రికి.. ప్ర‌మోష‌న్ల గ్యాస్ తీసేసిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close