ల‌క్ష్యం.. లౌక్యం.. ఇప్పుడు??

తెలుగు చిత్ర‌సీమ‌లో హిట్ కాంబినేష‌న్‌కి ఉండే క్రేజే వేరు. హీరో, డైరెక్ట‌ర్ల జోడీ ఓ సారి హిట్ అందుకొందంటే, ఆ కాంబినేష‌న్‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ చేయాల‌నుకొంటారు. ల‌క్ష్యంతో హిట్ కాంబో అనిపించుకొన్న గోపీచంద్, శ్రీ‌వాస్‌లు… లౌక్యంతో మ‌రో హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. గోపీచంద్ క‌థానాయకుడిగా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో మూడో సినిమా రావ‌డానికి స‌ర్వం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే క‌థ ఓకే అయిపోయింది. వ‌చ్చే నెల‌లో సెట్స్‌పైకి వెళ్తారు. ఈ చిత్రానికి శ్రీ‌వాస్ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలున్నాయి.

క‌థానాయిక‌గా ర‌కుల్‌ప్రీత్ సింగ్ పేరుని ప‌రిశీలిస్తున్నారట‌. లౌక్యంలోనూ.. ర‌కులే క‌థానాయిక‌. హీరో, హీరోయిన్‌, ద‌ర్శ‌కుడు ఇలా.. టీమ్ అంతా మ‌రోసారి క‌లుస్తున్నారు కాబట్టి ఈ చిత్రానికి లౌక్యం 2 అని పేరు పెట్ట‌వొచ్చేమో?? సౌఖ్యం సినిమాతో డిజాస్ట‌ర్ చ‌విచూసిన గోపీచంద్ ఈసారి క‌థ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉన్నాడట‌. వినోదం, యాక్ష‌న్ జోడించిన శ్రీ‌వాస్ మార్క్ క‌థ కావ‌డం, ఆల్రెడీ శ్రీ‌వాస్‌తో రెండు విజ‌యాలు కొట్ట‌డంతో గోపీచంద్ ఈ కాంబినేష‌న్‌పై బోల్డంత న‌మ్మ‌కం పెట్టుకొన్నాడు. మ‌రి ఈ హ్యాట్రిక్ సినిమా ఎలా ఉండ‌బోతోందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close