కల్తీ జరిగింది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆ కల్తీ ఎవరు చేశారో తనకు తెలియదని తాను సుద్దపూసనని ఆయన జాతీయ మీడియాకు చెప్పుకున్నారు. ఎవరు కల్తీ చేశారంటే.. చిన్న అప్పన్న అని సిట్ చెబుతోంది. అంటే చిన్న అప్పన్నను కఠినంగా శిక్షించి తనను వదిలేయాలని సుబ్బారెడ్డి అంటున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే చిన్న అప్పన్న నిమిత్తమాత్రుడు.. సుబ్బారెడ్డి దగ్గర పని చేసేవాడు. ఆయన ఏం చేయమని చెబితే అది చేసేవాడు. అతన్ని బలి చేసి తప్పించుకోవాలని సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు.
సుబ్బారెడ్డి మనిషిగానే అప్పన్న పలుకుబడి
ఈ చిన్న అప్పన్న ఎవరు అంటే..సుబ్బారెడ్డి పీఏ. కానీ ఆయనెవరో తనకు తెలియదన్నట్లుగాసుబ్బారెడ్డి నాటకం ఆడుతున్నారు. కల్తీ నెయ్యి కేసులో అంతా చేసింది సుబ్బారెడ్డి. కాకపోతే ఆయన చిన్న అప్పన్నను ముందుపెట్టి అంతా నడిపించారు. ఆయనకు యాభై వేలో అరవై వేలో జీతం ఇచ్చి మిగతా అంతా కోట్లకు కోట్లు తన వెనకేసుకున్నారు. కానీ ఇప్పుడు అంతాబయటపడి దొరికిపోయేసరికి తనదేం తెలియదు.. అసలు అప్పన్న ఎవడో కూడా తెలియదన్నట్లుగాసుబ్బారెడ్డి సిగ్గులేకుండా నాటకం ఆడుతున్నారు.
మీడియాలో వైరల్ అవుతున్న నిజాలు
కానీ సుబ్బారెడ్డి.. తో అప్పన్న నీడలా ఉండేవాడని సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. ఆయన ఫోన్ నెంబరే అప్పన్న వాడుతున్నారు. ఆయనతో పాటు ఎప్పుడూ నీడలా వెంట ఉండేవాడు. వైసీపీలో ఉన్న వారందరికీ అప్పన్న గురించి తెలుసు. సుబ్బారెడ్డి అతనితోనే అన్ని పనులు చేయిస్తాడని కూడా తెలుసు. ఇలాంటి సమయంలో సుబ్బారెడ్డి ఎందుకు తన కింద పని చేసే వాడిని బలి చేసి తాను తప్పించుకోవాలనుకుంటున్నాడు.. ఆయన కు కనీస మానవత్వం లేదా.. తన సంపాదన కోసం బడుగు వ్యక్తిని బలి చేసి తప్పించుకుంటాడా.. ?
చేసింది చిన్న తప్పిదం కాదు !
సాక్ష్యాలు అన్నీ సుబ్బారెడ్డికి, అప్పన్నకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తన పనులన్నీ చక్కబెట్టిన వ్యక్తిని, కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి, కనీసం పరిచయం లేదన్నట్లుగా నటించడం సుబ్బారెడ్డి మానవత్వానికి పట్టిన తుప్పును చూపిస్తోంది. భగవంతుడి ప్రసాదంతో చెలగాటమాడి, మహా పాపానికి ఒడిగట్టిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులే. కానీ, చేసిన తప్పును అంగీకరించే ధైర్యం లేక, తన కింద పనిచేసే వ్యక్తి మీద తోసేసి తప్పుించుకోవాలని చూడటంసుబ్బారెడ్డి వ్యక్తిత్వంలోని లోపాన్ని ఎండగడుతోంది. ఒక సాధారణ వ్యక్తిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల ఆధ్యాత్మిక సంపదను, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన ఈ వ్యవహారంలో అసలు నిందితులు చట్టం నుండి తప్పించుకోవాలని చూడటం అసాధ్యం. పైగా చేసింది చిన్న తప్పిదం కాదు..మహా పాపం. ఈ మహాపాపాన్ని తన కోసం పని చేసిన వ్యక్తి మీద తోసేసి పోతాడా.. ?
