సుక్కు… వేణు శ్రీ‌రామ్‌.. ఓ ప‌రుగు పందెం!

అల్లు అర్జున్ సినిమాల విష‌యంలో వేగం పెంచాడు. ఇప్పుడు త‌న చేతిలో మూడు సినిమాలున్నాయి.  కాక‌పోతే.. ఎంచుకున్న ద‌ర్శ‌కులే బన్నీని కాస్త డైలామాలో ప‌డేస్తున్నారు.  ఏ సినిమా ముందు చేయాల‌న్న ప్ర‌శ్న ఇప్పుడు బ‌న్నీ ముందు పెను స‌వాలుగా మారుతోంది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాని ప‌ట్టాలెక్కించేసిన బ‌న్నీ.. ఆ ప‌నుల్లో బిజీగా ఉంటూనే, రెండు స్క్రిప్టుల‌పైనా దృష్టి పెట్టాడు. సుకుమార్ సినిమాని ఈ నెల 11న లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. కానీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందో ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే… సుకుమార్ సినిమా కోసం బ‌న్నీ గెట‌ప్ మార్చాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ సినిమా కోసం గెడ్డం పెంచాలి. బాడీ మార్చాలి. త్రివిక్ర‌మ్ సినిమా చేస్తూ.. సుకుమార్ సినిమాని పూర్తి చేయ‌డం క‌ష్టం. 

సుకుమార్ కూడా ఇప్ప‌టికిప్పుడు బ‌న్నీతో సినిమా చేయ‌డానికి రెడీగా లేడు. సెకండాఫ్ విష‌యంలో సుక్కు ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతూనే ఉన్నాడు. అయితే వేణు శ్రీ‌రామ్ మాత్రం సుకుమార్ కంటే స్పీడుగా ఉన్నాడు. త‌న `ఐకాన్` స్క్రిప్టు దాదాపు రెడీ అయిపోయింది. మొద‌టి సీన్ నుంచి చివ‌రి వ‌ర‌కూ నేరేష‌న్ కూడా ఇచ్చేశాడు. చిన్న చిన్న క‌రక్ష‌న్లు త‌ప్ప‌… చేయాల్సిందేం లేదు. త్రివిక్రమ్ సినిమా చేస్తూ… ఐకాన్ పూర్తి చేసే ఛాన్సులు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. అదే జ‌రిగితే… సుకుమార్ కంటే ముందు ఐకాన్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. అయితే.. అంత‌కంటే ముందు త‌న స్క్రిప్టుని పూర్తి చేయాల‌ని సుకుమార్ భావిస్తున్నాడ‌ట‌. `ఐకాన్‌` ఫైన‌ల్ నేరేష‌న్ ఇచ్చేలోగా.. పూర్తి స్థాయి స్క్రిప్టు ఇచ్చేస్తాన‌ని అంటున్నాడ‌ట‌. ఇప్పుడు ప‌రుగు పందెం.. సుకుమార్‌, వేణు శ్రీ‌రామ్‌ల మ‌ధ్యే. మ‌రి ఈ రేసులో ఎవ‌రు గెలుస్తారో చూడాలి. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close