జగన్‌ సర్కార్‌కు అప్పులు రాకుండా సురేష్ ప్రభు లేఖ..!?

కార్పొరేషన్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా తీసుకుంటున్న రుణాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని… మాజీ కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ ప్రభుత్వం కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌లకు లేఖలు రాశారు. ఈ అంశానికి సంబంధిచిం ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డైరక్టర్ అయిన రవికుమార్ ఈ మేరకు తనకు లేఖ రాశారని.. తన లేఖకు దాన్ని జత చేస్తున్నట్లుగా సురేష్ ప్రభు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. నిబంధనల విరుద్ధంగా లోన్లు తీసుకుని.. ఉచిత పథకాల కోసం విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నాయని.. ఇది చాలా ఆందోళనకరమని సురేష్ ప్రభు లేఖలో చెప్పారు. ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలను అతిక్రమిస్తూ.., ప్రభుత్వం తరపు గ్యారంటీలు ఇచ్చి రుణాలు తీసుకుని వాటిని పథకాలకు మళ్లిస్తున్నారని సురేష్ ప్రభు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకే కార్పొరేషన్లకు ఇచ్చే రుణాలకు రెండు వందల శాతం ల్యాండ్ గ్యారంటీ తీసుకునేలా .. మార్టిగేజ్ చేసుకునేలా చూడాలని.. అలాగే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అదే సమయంలో సిబిల్ స్కోరును దాటి రుణాలు మంజూరు చేయకుండా చూడాలని కోరారు. నరేష్ కుమార్ అభిప్రాయాలన్నీ ఎంతో కీలకమైనవని పరిగణనలోకి తీసుకోవాలని సురేష్ ప్రభు నిర్మలా సీతారామన్‌ను కోరారు.

చాంబర్ ఆఫ్ కామర్స్ డైరక్టర్ అయిన రవికుమార్ లేఖ ద్వారా పంపిన అభిప్రాయాలు.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ఉన్నాయని .. ఎన్నికల్లో ఫలితాల కోసం.., ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని సురేష్ ప్రభు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాను రాను కంట్రోల్ తప్పి పోయే పరిస్థితికి వస్తుందన్నారు. చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే లేఖలో ఏ ప్రభుత్వాన్నీ ప్రస్తావించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ గురించేనని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో.. ఏపీ సర్కార్ అనేక కార్పొరే్షన్లు ఏర్పాటు చేస్తోంది. రుణాలు తీసుకోవడానికే ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టులకో కార్పొరేషన్.. అభివృద్ధి కార్పొరేషన్ అంటూ రకరకాలుగా ఏర్పాటు చేసి.. ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని చెప్పి బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటోంది.

ఆయా కార్పొరేషన్లకు ఆదాయం ఉండదు. ఖర్చులే ఉంటాయి. అయినప్పటికీ.. ప్రభుత్వ గ్యారంటీ పేరుతో రుణాలు తీసుకుని.. సంక్షేమ పథకాల పేరుతో… ఓటు బ్యాంకుకు పంపిణీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని నియంత్రించాలని సురేష్ ప్రభు కోరుతున్నారు. మరి ఈ అంశంపై నిర్మలా సీతారామన్..స్పందిస్తారో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close