త్రివిక్ర‌మ్‌తో సినిమా.. సూర్య ఏమ‌న్నాడు?

సూర్య‌కు తెలుగులో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఆశ‌. కాక‌పోతే స‌రైన క‌థ సెట్ అవ్వ‌డం లేదు. ఆమ‌ధ్య త్రివిక్ర‌మ్ – సూర్య ఇద్ద‌రూ క‌ల‌సి చేస్తార‌ని వార్త‌లొచ్చాయి. సూర్య కూడా ఈ విష‌యాన్ని ఒప్పుకున్నాడు. అయితే త్రివిక్ర‌మ్ త‌న సినిమాల‌తో తాను బిజీ అయిపోయాడు. సూర్య కూడా త‌మిళ ఇండ్ర‌స్ట్రీని వ‌దిలి రాలేక‌పోతున్నాడు. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య సినిమా ఎప్పుడు ఉంటుంది? అస‌లు వ‌స్తుందా? రాదా? ఈ విష‌య‌మై సూర్య స్పందించాడు.

”మా ఇద్ద‌రి మ‌ధ్య ప‌లుద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇప్ప‌టికీ న‌డుస్తూనే ఉన్నాయి. ఆయ‌న‌తో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి నేను కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా” అంటున్నాడు. అంటే.. త్రివిక్ర‌మ్ చెప్పిన క‌థ‌… సూర్య‌కు ఇంకా న‌చ్చ‌ట్లేద‌న్న‌మాట‌. మ‌రి సూర్య‌కు న‌చ్చే క‌థ త్రివిక్ర‌మ్ ఎప్పుడు చెబుతాడో?? అయితే తెలుగులో సినిమాలు చేయ‌లేక‌పోతున్నాన‌న్న బాధ మాత్రం సూర్య‌కు లేదు. ఈ విష‌యాన్ని త‌నే ఒప్పుకున్నాడు కూడా. ”నేను చేసే సినిమాల‌న్నీ రెండు భాష‌ల్లోనూ విడుద‌ల అవుతున్నాయి. ఓ ద్విభాషా చిత్రానికీ, తెలుగులో నెచురల్ గా న‌టించే చిత్రానికి ఉన్న తేడా ఏమిటో నాకు అర్థం కావ‌డం లేదు. బ‌హుశా… డ‌బ్బింగ్ సినిమాఅనేస‌రికి లిప్ సింక్ స‌రిగా కుద‌ర‌క‌పోవొచ్చు. అది త‌ప్ప‌… వేరే అడ్డంకులేం ఉండ‌వు” అని స‌మ‌ర్థించుకుంటున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close