సుశాంత్‌… గ‌ట్టిగా కొట్టాడుగా..!

సుశాంత్ సినిమాకి సంబంధించి కొన్ని రోజుల క్రితం ఓ టైటిల్ లోగోతో కూడిన పోస్ట‌ర్ హల్ చ‌ల్ చేసింది. `గ‌ట్టిగా కొడ‌తా` అనే పేరుతో సుశాంత్ సినిమా చేస్తున్నాడ‌న్న‌ది ఆ వార్త సారాంశం. అయితే.. ఈసినిమా తాను చేయ‌డం లేద‌ని, అస‌లు అలాంటి క‌థ విన‌లేద‌ని, త‌న‌పై ఇలాంటి రూమ‌ర్లు స్పైడ్ చేయొద్ద‌ని కోరాడు సుశాంత్‌. అయితే… ఇప్పుడు ఆ టైటిల్‌,పోస్ట‌ర్ సుశాంత్‌కి గుర్తొచ్చాయి. త‌న కొత్త సినిమా `చిల‌సౌ` ప్ర‌మోష‌న్ల కోసం దాన్ని వాడేశాడు. `చిల‌సౌ` కోసం ఓ ప్ర‌మోష‌న్ వీడియో త‌యారు చేసింది చిత్ర‌బృందం. అదంతా ఈ `గ‌ట్టిగా కొడ‌తా` చుట్టూనే తిరుగుతుంది. ప్ర‌స్తుతం ఉన్న ట్రెండు, ద‌ర్శ‌కులు క‌థ‌లు చెప్పే తీరుపై స‌ర‌దాగా ఓ సెటైర్ వేశాడు సుశాంత్‌. అయితే త‌న‌పై వ‌చ్చిన గాసిప్పుని ఇలా స్పోర్టివ్‌గా తీసుకుని, ఓ వీడియో చేయ‌డం, దాన్ని త‌న ప్ర‌మోష‌న్ కి వాడుకోవ‌డం.. ఇవ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. ఇదే క్రియేటివిటి.. సినిమాలోనూ చూపిస్తే…. సుశాంత్ ఈసారి గ‌ట్టిగా కొట్టేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close