స్విస్ చాలెంజ్ అంటే…తాడు మీద చంద్రబాబు నడక!

* అనుకున్నవారికే కాంట్రాక్టు ఇచ్చే అవకాశం – తీవ్రమైన విమర్శలకు ఆస్కారం
* నలుగురి మధ్యే వ్యవహారం – పారదర్శకత్వం జవాబుదారీ తనం నియంత్రణ శూన్యం
* ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రయోగం – సఫలమైతే బ్రహ్మరధం
* వారిదిపెద్ద లాభాపేక్ష – జాగ్రత్త బాబూ!

సింగపూర్ సంస్ధలే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేయబోతున్నాయి. ఇది పాత సంగతే! ఇందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ఇపుడు ఇది అఫీషియల్. రాజధాని నిర్మాణం కోసం రెండు సింగపూర్ కంపెనీలు, ఎపి ప్రభుత్వ సంస్ధ అమరావతి డెవలప్ మెంట్ కంపెనీ కన్సార్టియం గా ఏర్పడ్డాయి. ఇందులో అమరావతి కంపెనీ భాగస్వామ్యం 42 శాతం కాగా 58 శాతం వాటాలు సింగపూర్ కంపెనీలవే!

అమరావతి నిర్మాణానికి సింగపూర్, లండన్, జపాన్ కంపెనీలు ముందుకి వచ్చాయి. ముందుగా వచ్చిన సింగపూర్ కంపెనీల కన్సార్టియమ్ లో మనం చేరాము. ప్రపంచవ్యాప్తంగా స్విస్ చాలెంజ్ టెంటర్లకు పెద్ద పబ్లిసిటీ ఇచ్చి 45 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాము అని కేబినెట్ సమావేశం ముగిశాక ముఖ్యమంత్రి విలేకరులకు చెప్పారు.

ఒక పక్క సింగపూర్ కంపెనీలకు ఇచ్చేశామంటూ మరో పక్క గ్లోబల్ టెండర్ల అవసరం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం కోసం స్విస్ చాలెంజ్ అంటే ఏమిటో తెలుసుకోవలసిందే!

స్విస్ చాలెంజ్ పద్ధతి అంటే…ఒక ప్రైవేట్ సంస్థతో మాట్లాడుకొని వారిచ్చే ప్రతిపాదనకు ఒప్పుకొని కాంట్రాక్ట్ ఇవ్వజూపడం. అనంతరం ఇతర సంస్థలను కూడా ఆహ్వానించి అంత కంటే మంచి ప్రతిపాదన ఇవ్వమని అడగడం లేదా మొదటి ప్రతిపాదనలో మార్పులు సూచించమని చెప్పడం. ఇతర సంస్థలు సూచించిన మంచి మార్పు లను అమలు చేయడానికి అంగీకరిస్తే మొదటి సంస్థకే ఆ కాంట్రాక్టు అప్పగి స్తారు. ఇతర సంస్థలు ప్రతిపాదించిన మార్పులను అమలుచేయడం సాధ్యం కాదని మొదటి సంస్థ చేతులెత్తేస్తే ఆ కాంట్రాక్టును వేరే సంస్థకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే, మాస్టర్ ప్లాన్ తయారుచేసిన వారికి దానిలోని మతలబు తెలుస్తుంది కనుక సహజంగానే మాస్టర్ డెవలపర్‌గా తెలివైన ప్రతిపాదనలతోనే ముందు కొచ్చే అవకాశముంది. అమరావతి విషయంలో ఈ చాన్స్ సింగపూర్ కంపెనీలకు దొరికింది.

మాస్టర్ డెవలపర్ ఎవరు అని గత ఏడాది విలేకరులు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ని అడిగినపుడు ”ఎలా తెలుస్తుంది. ఇంకా టెండర్లే పిలవవేదు కదా” అని సమాధానమిచ్చారు. తరువాత రెండు రోజులకే ” అంతా సింగపూర్‌కే స్విస్ చాలెంజ్ పద్ధతిలో అప్పగిస్తున్నామని ” ముఖ్యమంత్రి ప్రకటించారు.

స్విస్ చాలెంజ్ పద్ధతి మన దేశంలో గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో అమలు జరుగుతోంది. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత తక్కువ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ పద్ధతిలో జరిగే పనులకే ఈ విధానం కొంతవరకు అనుకూలం. అక్కడ కూడా ప్రైవేటు సంస్థ సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వ్యయం ఎక్కువ అవుతోందని చెప్పినా కాంట్రాక్టు కొనసాగించలేకా, బయటపడలేకా సతమతం కావలసివస్తుంది.

మహారాష్ట్రలో అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని ముంబై మెట్రో కంపెనీ టికెట్ చార్జీలను మూడురెట్లు పెంచాలంటూ పట్టుపట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చవాన్ మెట్రోరైల్ కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మేలుకదా అని ఆలోచించారు. అలాంటి సందర్భాలలో ప్రభుత్వ అధికారాలపై స్పష్టత లేదు.

పూలింగ్ ద్వారా భూములను సమీకరించిన సందర్భంలో మీతో వ్యాపారం చేయిస్తాను. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాను అని రైతులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎందుకో కానీ ఈ వ్యవహారం అంతా గజి బిజిగా అనిపించి ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు మర్యాదగా వెళ్ళిపోయారు. పురపాలక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన సాంబశివరావు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా. మరో ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఏరికోరి తెచ్చుకున్న అధికారి గిరిధర్ – సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాస్టర్‌ప్లాన్ తీసుకువచ్చిన సందర్భంలోనే దీర్ఘకాలిక సెలవు పెట్టి మరో శాఖకు వెళ్ళిపోయారు.

అనుకున్న వారికే కాంట్రాక్టు కట్టబెట్టడానికి అవకాశాలున్న స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేకపోవడం, విమర్శలకు ఎక్కువ ఆస్కారం వుండటం ఉన్నతాధికారులను ఇబ్బంది పెడుతోంది…వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫైళ్ళపై సంతకాలు చేసి జైలుకి వెళ్ళిన ఐఎస్ అధికారి శ్రీలక్ష్మి అనుభవం వారిని వెంటాడుతోంది.

స్విస్ చాలెంజ్ పద్ధతికి కేబినేట్ ఆమోదాన్ని తెలిపే ప్రతిపాదన ఫైలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సంతకం చేయకపోవడం వల్లే కేబినెట్ సమావేశం రెండుసార్లు వాయిదా పడింది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ- కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) సిఇఒ , ఐఏఎస్ అధికారి శ్రీకాంత్‌ మరో ఐఎఎస్ అధికారి అజయ్‌జైన్‌ మినహా అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యక్ష పాత్ర, ప్రమేయం వున్న వారు ఎవరూ లేరు! ఉపముఖ్యమంత్రి కూడా అయిన రెవిన్యూ మంత్రి కెఇకృష్ణమూర్తి ”అక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలియదు”అని ఆరునెలలక్రితమే చెప్పారు.

స్విస్ చాలెంజ్ కాంట్రాక్టు తీసుకున్న పెద్ద పీపీపీ (పబ్లిక్ ప్రయివేట్ పార్టిసిపేషన్) ప్రాజెక్టులను యూపీఏ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిధిలోకి తీసుకొని వచ్చింది. పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిలబెట్టడానికి అలాంటి వ్యవస్ధ ఆంధ్రప్రదేశ్ లో లేదు.

ఈ పూర్వరంగంలో, ఓటర్లయిన సామాన్యులకు అర్ధంకాని సంక్లిష్టమైన స్విస్ చాలెంజ్ విధానాన్ని నెత్తికెత్తుకుని చంద్రబాబు నాయుడు తాడుమీద నడక ప్రారంభించారనుకోవలసి వస్తోంది. గత అక్టోబరులో చంద్రబాబు డిల్లీలో నరేంద్రమోదీని కలిసి సింగపూర్ కంపెనీలు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు చెప్పారు…ఆప్పట్లోనే వచ్చిన వార్తల ప్రకారం ” వారు ఎక్కువ లాభాపేక్ష కలిగి వున్నవారు జాగ్రత్తగా వుండండి” అని ప్రధాని సూచించారు.

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సూచనను అమలు చేయవలసిన టైమ్ మొదలైంది!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close