వారికి నోటీసులు అందుకేనా?

ఏపిలో ఇంత వరకు మొత్తం 8మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి మారారు. వారందరి చేత రాజీనామా చేయించి ఉపఎన్నికలు నిర్వహించమని వైకాపా ఒత్తిడి తెస్తోంది. కానీ అందుకు తెదేపా అంగీకరించలేదు. కనుక వారందరిపై అనర్హత వేటు వేయాలని వైకాపా కోరుకొంటోంది. కానీ దానికి కూడా స్పీకర్ అంగీకరించరు కనుక త్వరలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి విప్ వారికి కూడా విప్ జారీ చేసి దానిని వారు ఉల్లంఘించితే వారిపై అనర్హత వేటు పడేలా చేయాలని వైకాపా భావిస్తోంది. ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే న్యాయస్థానం ద్వారానయినా ఏదో విధంగా వారిపై చర్యలు తీసుకొనేలాగ చేయగలిగినట్లయితే మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరయినా పార్టీ మారే ఆలోచన ఉన్నట్లయితే అటువంటి ఆలోచన విరమించుకొంటారని వైకాపా భావిస్తోంది. కనుక మార్చి 5 నుండి జరుగబోయే శాసనసభ సమావేశాలలో ఇదే ప్రధాన అంశంగా చేసుకొని వైకాపా పోరాడే అవకాశం ఉంది.

సరిగ్గా ఇప్పుడే తెలంగాణా స్పీకర్ మధుసూదనాచారి తెరాసలో చేరిన 10 మంది తెదేపా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం ఆలోచింపజేస్తోంది. ఇన్ని నెలలుగా కాంగ్రెస్, తెదేపాలు ఎంతగా ఒత్తిడి చేసినా పట్టించుకోని స్పీకర్, ఇప్పుడు అకస్మాత్తుగా నోటీసులు జారీ చేయడం వెనుక తెరాస-వైకాపాల వ్యూహం ఏమయినా ఉందా అనే అనుమానం కలిగిస్తోంది. నోటీసులు ఇవ్వడానికి ఆయన ఎంచుకొన్న సమయం కారణంగానే అనుమానించ వలసివస్తోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఇంచుమించు ఒకేలాగ సాగుతున్నందున, ఒకచోట జరిగినది రెండవ చోట కూడా జరిగే పరిస్థితి కనిపిస్తోంది.

తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై ఒత్తిడి తెస్తున్న సమయంలో, తెలంగాణా శాసనసభ స్పీకర్ పార్టీ ఫిరాయించిన తెదేపా ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేయడం వలన ఇప్పుడు కోడెలపై కూడా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. తెరాస, వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబందం గురించి, ఆ రెండు పార్టీలకి తెదేపా పట్ల ఉన్న శత్రుత్వం గురించి అందరికీ తెలుసు. కనుక ఏపిలో పార్టీ మారిన వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనేందుకు స్పీకర్ పై ఒత్తిడి తెచ్చేందుకే తెలంగాణాలో తెదేపా ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేసి ఉండవచ్చును. లేదా వరుస విజయాలతో దూసుకుపోతున్న తెరాస పార్టీ త్వరలో 10 మంది తెదేపా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, వరంగల్ ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు పూర్తి కాగానే అదే ఊపులో ఉపఎన్నికలకు వెళ్లడం వలన ఆ స్థానాలను అన్నిటినీ తెరాస ఖాతాలో వేసుకోవచ్చునని భావిస్తోందేమో?

ఆ విధంగా చేసినా కూడా ఆ ప్రభావం తప్పకుండా ఏపి ప్రభుత్వంపై పడుతుంది. ఆ స్థానాల భర్తీ కోసం తెలంగాణాలో ఉపఎన్నికలు జరిగితే, ఆంధ్రాలో కూడా ఉపఎన్నికల కోసం ప్రతిపక్షాల నుండి ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో తెలంగాణాలో ఉపఎన్నికలు జరిగి అందులో కూడా తెదేపా, బీజేపీలు ఓడిపోయినట్లయితే ఆ ప్రభావం కూడా ఆ రెండు పార్టీలపై, ఏపి ప్రభుత్వంపై చాలా ఉంటుంది. ఇదంతా నిజమా కాదా అనే విషయం తెలంగాణా శాసనసభ స్పీకర్ తదుపరి చర్యలను బట్టి తేలుతుంది. ఒకవేళ తెరాస, వైకాపాల ఉద్దేశ్యం ఇదే అయితే త్వరలోనే తప్పకుండా 10 మంది తెదేపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్ళవచ్చును. అలా కాకుంటే స్పీకర్ మధుసూదనాచారి ఇప్పుడు నోటీసులు ఇవ్వడంలో అర్ధమే ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close