” నిరుద్యోగ భృతి” అమలు అసలు సవాల్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో సారి ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనవవి రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి. రైతుల రుణమాఫీ ఏం అయిందో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. రేపోమాపో… పథకం అమలును కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. ఈ భృతి పథకం అమలుపై నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు బడ్జెట్లలో దీని గురించి ప్రస్తావించలేదు. తర్వాత బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించనున్నట్లు కేటీఆర్ మాటల ద్వారా తెలుస్తోంది. నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది.

తెలంగాణలో నిరుద్యోగం రేటు ఎక్కువగానే ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం… తెలంగాణ ఏర్పుటుక ముందు పది జిల్లాల్లో దాదాపుగా పది లక్షల మంది నిరుద్యోగులున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడినా.. నిరుద్యోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం పదిహేను లక్షల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే… నిరుద్యోగి అనే ప్రామాణికమే కీలకం కానుంది. అర్హతలు నిర్ణయించే దాన్ని బట్టి.. లబ్దిదారుల సంఖ్య పెరగడమో.. తగ్గడమో జరుగుతుంది.

లక్షల మందికి నెలకు జీతం ఇచ్చినట్లుగా రూ.3016 ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలంగాణ సర్కార్‌కు ఇబ్బందికరమే. కానీ హామీలను అమలు చేయక తప్పని పరిస్థితి. నిరుద్యోగ భృతినిని గతంలో చంద్రబాబు సర్కార్ అమలు చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చి మళ్లీ.. ఎన్నికలకు కొంత ముందు ప్రారంభించడంతో రావాల్సిన మైలేజీ రాలేదు. ఈ విషయాన్ని కూడా తెలంగాణ సర్కార్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే నిరుద్యోగభృతిని… నిరుద్యోగుల్లో అసంతృప్తి రాకుండాఅమలు చేయడం… ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close