ఎన్నికల‌ కోడ్ వ‌చ్చేసింది… మంత్రుల‌ హ‌డావుడి త‌గ్గాల్సిందే!

తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక షెడ్యూల్ వ‌చ్చేసింది. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేష‌న్ల ఎన్నిక‌కు వ‌చ్చే నెల 7న నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంది. 8 నుంచి 10వ తేదీ వ‌ర‌కూ నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. ఆ మ‌ర్నాడే స్క్రూట్నీ ఉంటుంది. నామినేష‌న్ల‌కు సంబంధించిన అప్పీల్స్ పై తుది నిర్ణ‌యం 13న ఉంటుంది. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ‌, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న 14న జ‌రుగుతుంది. పోలింగ్ 22వ తేదీన జ‌రుగుతుంది. అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో రీపోలింగ్ 24న పూర్తి చేస్తారు. కౌంటింగ్ ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 25న ఉంటుంది. మొత్తం ప్ర‌క్రియ‌ను ఒకే నెల‌లో పూర్తి చేయాల‌ని అధికారులు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, వైస్ ఛైర్మన్లు, మేయ‌ర్లు డెప్యూటీ మేయ‌ర్లు… అన్నీ జ‌న‌వ‌రి నెలాఖ‌రుకు పూర్త‌యిపోతాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారం సంక్రాంతి పండుగ రోజున ప్రారంభం కానుంది. ఆ త‌రువాత కూడా మ‌హా అయితే ఓ వారం పాటు మాత్ర‌మే ప్ర‌చారానికి అభ్య‌ర్థుల‌కు స‌మ‌యం ఉన్న‌ట్టు. అయితే, ఇప్ప‌టికే చాలామంది తామే అభ్య‌ర్థుల‌మ‌ని చెప్పుకుంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టేస్తున్నారు. ఇక‌, ప్ర‌ధాన రాజ‌కీయ‌ పార్టీలు మున్సిప‌ల్ ఎన్నిక‌ల ల‌క్ష్యంగానే ఈ మ‌ధ్య వ‌రుస‌గా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఉనికి చాటుకుని తీర‌తామ‌ని ప్ర‌య‌త్నిస్తున్న భాజ‌పా… మ‌ద్య నిషేధ ఉద్య‌మం, మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌, కేసీఆర్ స‌ర్కారు వైఫ‌ల్యాలను ఎండ‌గ‌ట్ట‌డం, కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన సీఏఏ గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం, కేంద్ర పథ‌కాల‌ను ప్ర‌చారం చేసే ప‌నిలో ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే నిమ‌గ్న‌మై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆస్త ఆల‌స్యంగా, దిశ ఘ‌ట‌న అనంత‌రం యాక్టివేట్ అయింది. వారిదీ కేసీఆర్ స‌ర్కారు వైఫ‌ల్యాల ప్ర‌చార‌మే ప్ర‌ధానాస్త్రం.

భాజ‌పా, కాంగ్రెస్ లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నాయి కాబ‌ట్టి, సోమ‌వారం నుంచి అమ‌ల్లోకి వస్తున్న ఎన్నిక కోడ్ వారిపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు. కానీ, అధికార పార్టీ తెరాస మీద కోడ్ ప్ర‌భావ ఉంటుంది! ఎందుకంటే, గ‌డ‌చిన ప‌దిరోజులుగా మంత్రులూ ఎమ్మెల్యేలూ జిల్లాల్లో తీవ్రంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. వ‌రుస‌గా అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేస్తున్నారు. వీటికి ఇప్పుడు బ్రేక్ ప‌డ్డ‌ట్టే అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ ఏం సాధించామో అదే ప్ర‌చారం చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. కోడ్ అమ‌ల్లోకి రావ‌డం వ‌ల్ల గ‌త కొద్దిరోజులుగా క‌నిపిస్తున్న అధికార పార్టీ నేత హ‌డావుడి త‌గ్గుతుంది. ప్ర‌చార హ‌డావుడి మ‌ళ్లీ పెరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close