తగ్గేది లేదు..! “పోతిరెడ్డిపాడు”కు నేడో రేపో టెండర్లు..!

ముందుకెళ్లకుండా చూడాలని కేంద్ర జలవనరుల మంత్రి కేఆర్ఎంబీని ఆదేశించినా.. కేఆర్ఎంబీ.. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చెప్పినా… రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. ఇప్పుడు టెండర్లను ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభించింది. వైసీపీ సర్కార్ బెంచ్ మార్క్ విధానం అయిన .. రివర్స్ టెండరింగ్ ద్వారా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ప్రాజెక్ట్ వ్యయం.. రూ.6,829.15 కోట్లు. సంగమేశ్వరం వద్ద నిర్మించే ఎత్తిపోతల పథకంతో పాటు కాలువల విస్తరణ కూడ ఈ పథకంలో భాగంగా ఉన్నాయి.

ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిధులకు పాలనామోదం ఇచ్చారు. మొత్తం రెండు ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్టులోని సంగమేశ్వరం పాయింటు నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసేలా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తారు. పంపుహౌస్‌లు, మోటార్లు, పైపులైన్ల పని అంతా ఒకే ప్యాకేజీగా ఇస్తారు. పోతిరెడ్డి పాడు నుంచి నీటిని తరలించే వివిధ ప్రాజెక్టుల కాల్వన సామర్థ్యం పెంచడాన్ని మరో ప్యాకేజీగా నిర్ణయించారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆమోదం చెప్పగానే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రివర్స్ టెండర్లు కూడా పూర్తయిన తర్వాతనే టెండర్లు ఖరారు చేస్తారు.

ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదాస్పదం అయింది. తెలంగాణ ప్రభుత్వం… కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే.. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకోవావాలని చెబుతోంది. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. ఇది పాత ప్రాజెక్టేనని చెబుతూ.. ముందుకెళ్లడానికి నిర్ణయించుకుంది. ఎవరి అభ్యంతరాలనూ పట్టించుకోవాల్సిన పని లేదని వాదిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close