బాలయ్య సినిమా అంటే తమన్ కి పూనకం వచ్చేస్తుంది. వరుసగా ఐదు సినిమాలు చేసిన కాంబినేషన్ ఇది. అఖండ 2 డిసెంబర్ 5న వస్తోంది. అఖండ సమయంలో స్పీకర్లు పేలిపోయే మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఇప్పుడు కూడా ఓ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ”డిసెంబర్ 5న ఎవరు కూడా బాక్సులు, స్పీకర్లు పేలిపోయే అని కంప్లైంట్ చేయకూడదు. ముందే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి. బోయపాటి నిజంగా అలాంటి సినిమా తీశారు’ అని చెప్పుకొచ్చారు.
”అఖండ సినిమా చేయాలంటే చాలా బలం కావాలి. ఈ సినిమా చేసింది నేను కాదు.. శివుడే చేయించుకున్నాడు. అఖండ అనేది ఒక గుడి. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని బిగ్ స్క్రీన్ పై చూస్తుంటే మీరందరూ చేతులెత్తి దండం పెడతారు’అన్నారు.
అన్నట్టు.. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కూడా మ్యూజిక్ తమనే. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు తమన్. మొత్తనికి బాలయ్య తమన్ కలిసి సిక్సర్ కొట్టేస్తున్నారు.