ప్రజారాజధాని అమరావతిలో జరుగుతున్న పనులను ప్రపంచ బ్యాంక్ , ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృందం పరిశీలిస్తోంది. ఆత్యధిక ఆర్థిక సాయం వీరే చేస్తున్నందున పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి బృందాలు వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఈ బ్యాంకుల టీములు నిర్మాణాలను పరిశీలిస్తున్నాయి. ట్రాఫిక్ ఫ్లో నిర్వహణ, రహదారులు, BRT ప్రణాళిక తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన కార్యకలాపాలపై చర్చలు నిర్వహించారు.
అలాగే కన్సల్టెన్సీలు, కాంట్రాక్టర్ ప్రతినిధులు, ఇతర సిబ్బందితోనూ సమావేశం అయ్యారు. అలాగే స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్‌లో భాగంగా APCRDA అధికారులు, విలేజ్ ఫెసిలిటేటర్స్, NGO సంస్థలతో నూ బ్యాంకుల బృందం సమావేశమైంది. రాజధాని ప్రాంతంలో గ్రామస్తులు, రైతులు, రైతు కూలీలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, స్థానికుల నుంచి నమోదవుతున్న అర్జీలు..అర్జీల పరిష్కారం కోసం అమలవుతున్న కార్యకలాపాల గురిం సమావేశంలో చర్చించారు.
అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటించిన బృందం రాయపూడిలో స్థానికులతో సమావేశమై భూసమీకరణ పథకం, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు పలు అంశాలు చర్చించింది. అలాగే NCC, RVR సంస్థల లేబర్ క్యాంపులను సందర్శించింది. అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్న సైట్లలో కార్మికుల కోసం అమలవుతున్న ఆరోగ్య భద్రతా నియమాలు, క్యాంపు సైట్లను పరిశీలించి కార్మికులతో బృందంలోని సభ్యులు మాట్లాడారు.
ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు అప్పులు ఇచ్చినా ఎంతో బాధ్యతగా ఇస్తాయి. వాటి వల్ల ప్రజాజీవనం మెరుగుపడాలని లక్ష్యంగా పెట్టుకుంటారు.