అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో టెక్ దిగ్గజాలతో సమావేశం అయ్యారు. గూగుల్, అడోబ్ , ఎన్వీడియా వంటి సంస్థలు ముఖ్యలతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో గూగు ల్అతి పెద్ద ఏఐ హబ్ ను నిర్మిస్తోంది. ఈ క్రమంలో ఆయన గూగుల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో సమావేశం అయ్యారు.
ఏపీలో అవకాశాల్ని సుందర్ పిచాయ్‌కు వివరించిన నారా లోకేష్
శాన్ ఫ్రాన్సిస్కోలో అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తో నారా లోకేష్ సమావేశం అయ్యారు. విశాఖపట్నం AI డేటా సెంటర్లో $15 బిలియన్ల మైలురాయి పెట్టుబడి పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది US వెలుపల అతిపెద్ద FDI ప్రాజెక్టులలో ఒకటిగా ఉండబోతోంది. ఈ పెట్టుబడి పురోగతిని సమీక్షించామని.. వేగవంతం చేసే విషయంలో అందించాల్సిన సహకారాన్ని అందిస్తామన్నారు. ్లాగే డ్రోన్ సిటీలో డ్రోన్ అసెంబ్లీ, కాలిబ్రేషన్ & టెస్టింగ్ యూనిట్‌ను ,అలాగే సర్వర్ల తయారీ కి అవసరమైన ఎకోసిస్టమ్ ను పెంచడానికి గూగుల్ ను ఏపీకి ఆహ్వానించారు నారా లోకేష్.
ఎన్వీడియా వైస్ ప్రెసిడెంట్ తో నారా లోకేష్ సమావేశం
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలన ఎన్వీడియా. శాంటా క్లారాలోని NVIDIAలో ఎంటర్ప్రైజ్ & క్లౌడ్ సేల్స్ VP రాజ్ మిర్పురిని నారా లోకేష్ కలిశారు. AI నైపుణ్య అభివృద్ధి, స్మార్ట్ తయారీ, భవిష్యత్తు సాంకేతికతలపై ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం కావాలని NVIDIAని ఆహ్వానించారు. ఓమ్నివర్స్ & ఐజాక్ సిమ్‌ని ఉపయోగించి స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్‌ను ప్రతిపాదించినట్లుగా నారా లోకేష్ తెలిపారు. APలో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచ OSAT/ATMP భాగస్వాములను తీసుకురావడానికి అవసరమైన మద్దతు ఇవ్వాలని కోరారు. భారతదేశం తదుపరి AI-ఆధారిత పరిశ్రమకు ఆతిథ్యం ఇవ్వడానికి మేము ప్రతిభ, మౌలిక సదుపాయాలు , విధానాలతో సిద్ధంగా ఉన్నామని వివరించారు.
ఇతర దిగ్గజ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశాలు
శాంటా క్లారాలోని ఇంటెల్ ప్రధాన కార్యాలయంలో ఇంటెల్ గ్లోబల్ ఐటీ CTO శేష కృష్ణపురతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ & ప్యాకేజింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. దీనికి మా బలమైన సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ , VCIC కారిడార్ మద్దతు ఉందని తెలిపారు. IIIT శ్రీ సిటీ / IIT తిరుపతితో ఇంటెల్–అమరావతి AI పరిశోధన కేంద్రం, ఆవిష్కరణల కోసం HPC క్లస్టర్లు , ఇంటెల్ స్కిల్ ల్యాబ్‌లను ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయని వివరించారు. అంతకు ముందు ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్ తో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశం అయ్యారు. ప్రతి కుటుంబంలో ఓ ఏఐ నిపుణుడు ఉండాలన్న ఆలోచనను అమలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీతో కలిసి పనిచేయాలని కోరారు. తొలిదశలో ఏపీలోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ఉచిత చాట్ జీపీటీ అందించాలని భావిస్తున్నామని, ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తోనూ సమావేశమయ్యారు.
ఇప్పటికిప్పుడు ఏపీలో పెట్టుబడులపై ప్రకటనలు చేయకపోయినా..ఏపీలో ఉన్న అవకాశాలు, ఎకో సిస్టమ్ లు ఆయా కంపెనీ దృష్టిలో పడేలా నారా లోకేష్ చేయగలిగారు.గతంలో ఇలా గూగుల్ ప్రతినిధులకు ఇచ్చిన.. ప్రతిపాదనల వల్లే ఏఐహబ్ వచ్చింది. ముందు ముందు నారా లోకేష్ మార్కెటింగ్ గొప్ప ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
